150 ఏళ్ల తర్వాత ఏర్పడనున్న అరుదైన సంపూర్ణ చంద్ర గ్రహణం..!
- January 04, 2018
విశ్వం ఎప్పుడు రహస్యమే.. ఇక విశ్వంలో ఏర్పడే గ్రహణాలు ఎప్పుడూ ప్రత్యేకమే.. కాగా ఈ ఏడాది లో జనవరి 31 న ఏర్పడే తొలి సంపూర్ణ చంద్ర గ్రహణం కు మరింత ప్రత్యేక ఉన్నది. 150 ఏళ్ల తర్వాత ఏర్పడనున్న ఈ చంద్ర గ్రహణం గురించి వివరాల్లోకి వెళ్తే..
2018 జనవరి నెలలో రెండు పౌర్ణమి.. ఒకే నెలలో వచ్చే రెండో పున్నమిని బ్లూ మూన్ అంటారు.. ఇలా వస్తున్న బ్లూ మూన్ రోజైన జనవరి 31న గ్రహణం ఏర్పడనుండటం విశేషం.. జనవరి 31 అర్ధ రాత్రి గ్రహణం ఏర్పడి.. మొత్తం 77 నిమిషాల పాటు ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ సంపూర్ణ గ్రహణాన్ని మధ్య, తూర్పు ఆసియా, ఇండోనేషియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల్లోని ప్రజలు చూడవచ్చు. అంతేకాదు.. అలస్కా, హవాయి, ఆగ్నేయ కెనడా ప్రాంత ప్రజలు గ్రహణం ఏర్పడింది మొదలు.. గ్రహణం విడిచే వరకూ సంపూర్ణంగా చూసే అవకాశం ఉంది. బ్లూమూన్ రోజున ఏర్పడుతున్న సంపూర్ణ చంద్ర గ్రహణం 150 ఏళ్లలో ఇదే తొలిసారి.. ఈ గ్రహణ సమయంలో చంద్రుడి కింద భాగం ప్రకాశవంతంగా కనిపిస్తుంది. కాగా చివరిసారి.. ఇటువంటి గ్రహణం మార్చి 31, 1866లో కనిపించింది. ఐతే ఇటువంటి చంద్ర గ్రహణాలు మళ్ళీ 2028 డిసెంబర్ 31న, 2037 జనవరి 31 న ఏర్పడనున్నాయి.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







