చోరీకి గురైన అత్యంత ఖరీదైన మద్యం సీసా
- January 04, 2018
డెన్మార్క్: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మద్యం సీసా చోరీకి గురైంది. డెన్మార్క్ రాజధాని కోపెన్‌హాగెన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. రూసో బాల్టీక్ అనే వోడ్కా బాటిల్ ఖరీదు 1.3 మిలియన్ డాలర్లు. అంటే దాదాపు రూ.8.2 కోట్లు. ఇప్పటివరకు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మద్యం సీసాగా దీనికి గుర్తింపు ఉంది.
ఈ మద్యం సీసాను మూడు కిలోల బంగారం, వెండితో తయారుచేశారు. సీసా మూతను వజ్రంతో తయారుచేశారు. కోపెన్‌హాగెన్‌లోని 33 కెఫె అనే బార్లో ఈ సీసాను ప్రదర్శనకు ఉంచారు. బార్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌లో ఓ వ్యక్తి టోపీతో వచ్చి ఈ సీసాను దొంగిలించినట్లు రికార్డ్ అయింది. ఫుటేజ్ ఆధారంగా దొంగను పట్టుకునేందుకు అక్కడి పోలీసులు యత్నిస్తున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







