ఆర్మీ వెల్ఫేర్ కు రూ. 5 లక్షల అందజేయనున్న అర్చర్ జ్యోతి సురేఖ
- January 04, 2018
కష్టపడి ఎదిగిన వ్యక్తి.. అవతలి వారి కష్టంలో ఉంటే ఆదుకోవాలి అనే ఆలోచన వస్తుంది.. ఎందుకంటే కష్టం బాధతెలుసు కనుక.. ఎంతో కష్టపడి పైకి వచ్చిన అర్చర్ జ్యోతి తన పెద్దమనసును చాటుకొన్నది. తనకు అర్జున అవార్డ్ తో పాటు వచ్చిన నగదు పురష్కారం రూ. 5 లక్షలను ఆర్మీ వెల్ఫేర్ కు అందజేయనున్నట్లు ఆమె తెలిపింది. ఆర్మీ వెల్ఫేర్ కు ఎందుకు ఇస్తున్నానంటే.. మన కోసం.. మనల్ని మన దేశాన్ని రక్షించడం కోసం.. అహర్నిశలు సరిహద్దుల్లో కాపలా ఉండి.. ప్రాణాలకు తెగించి కష్టపడుతున్న ఆర్మీ వారికి ఇవ్వాలనే ఆలోచనవచ్చిందని జ్యోతి సురేఖ తెలిపారు. ప్రధాని మోడీ ఎప్పుడు ఆపాయింట్ మెంట్ ఇస్తే అప్పుడు ఈ చెక్ ను తాను అందజేస్తానని ఆమె చెప్పారు. తాను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చాలా మంది సహాయం చేశారని.. తనకు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది.. ఉద్యోగం ఇస్తానని ప్రకటించింది అని ఆమె సంతోషం వ్యక్తం చేసింది. కాగా ఇప్పటికే అక్షయ్ కుమార్, సింధు, గౌతమ్ గంభీర్ వంటి వారు ఆర్మీ కుటుంబాలను ఆడుకోవడానికి ముందుకొచ్చారు అన్న సంగతి తెలిసిందే..
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







