అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ గుర్తింపు రద్దు
- January 04, 2018
తెలుగు చలన చిత్ర పరిశ్రమకు రెండుకళ్లు.. ఎన్టీఆర్, ఏఎన్నార్ లు.. అత్యధిక సుదీర్ఘ కాలం సినిమాల్లో నటించిన చరిత్రగల నటుడు అక్కినేని నాగేశ్వర రావు. ఆయన వారసుడు గా అక్కినేని నాగార్జున వెండి తెరపై అడుగు పెట్టి.. స్టార్ హీరోగా కొనసాగుతుండగానే.. ఆయన తనయులు చైతు, అఖిల్ లు కూడా హీరోలుగా అడుగుపెట్టారు. కాగా అక్కినేని వారింట పెళ్లి సందడి తర్వాత వస్తున్న పండగల్తో హ్యాపీ ఉన్న ఫ్యామిలీ కి కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. అక్కినేని కుటుంబానికి చెందిన అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ గుర్తింపు ను రద్దు చేసింది. దేశ వ్యాప్తంగా ఐటీ రిటర్న్స్ సమర్పించని పలు ఎన్జీవో సంస్థల గుర్తింపు రద్దు చేసినట్లు కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు రాజ్యసభలో ప్రకటించారు, కాగా ఇలా రద్దు చేసిన సంస్థల జాబితాలో తెలంగాణకు చెందిన 190 సంస్థలుంటే.. ఏపీ కి చెందిన 450 సంస్థలున్నాయి. కాగా అక్కినేని కుటుంబం అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ను 2004 లో ఏర్పాటు చేసి అప్పటి నుంచి పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. ప్రతి ఏడాది అక్కినేని నాగేశ్వరరావు జాతీయ అవార్డ్ ప్రధానంతోపాటు.. గుడివాడలో అక్కినేని వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నది. కాగా పలు సంస్థల రద్దు విషయాన్ని రాజ్యసభలో ప్రకటించిన కిరణ్ రిజుజు విదేశీ సంస్థల నుంచి విరాళాలు అందుకుంటున్న ఎన్జీవోల వార్షిక ఆదాయ వివరాలను ఇవ్వాలని కేంద్రం ఆదేశించింది. ఆదేశాలను పాటించని కొన్ని సంస్థలకు ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ను రద్దు చేసింది.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







