సౌందర్య భర్త ఏమి చేస్తున్నాడో తెలిస్తే..! ఛిఛీ..!!

- January 06, 2018 , by Maagulf
సౌందర్య భర్త ఏమి చేస్తున్నాడో తెలిస్తే..! ఛిఛీ..!!

సౌందర్య.. సినీ ఇండస్ర్టీలకు పరిచయం అక్కర్లేని పేరు. అంతలా పేరు తెచ్చుకుంది నటి సౌందర్య. స్టార్ హీరోల సరసన నటించడమే కాకుండా.. యువ నటులు హీరోగా తెరకెక్కే చిత్రాల్లో హీరోయిన్‌గా జతకట్టడమే కాకుండా.. లేడీ ఒరియంటెడ్ మూవీస్‌తోను సినీ జనాలను అలరించింది సౌందర్య. అప్పట్లో సౌందర్యకు స్టార్ హీరోలతో సమానంగా క్రేజ్‌ను సొంతం చేసుకుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆమె సినిమాల్లో ధరించే వస్ర్తాలకు బహిరంగ మార్కెట్‌లో భలే గిరికీ ఉండేది. దీంతో ఆమె ముందు యాడ్స్ కంపెనీలు క్యూలో ఉండేవి. అంతేకాదు. సౌందర్య పలనా సినిమాలో నటించిందంటే..ఆ సినిమా హిట్ పక్కా అన్నటువంటి టాక్ రావడంతో నిర్మాతలతోపాటు స్టార్ హీరోలు సైతం సౌందర్య డేట్స్ కోసం వెయిట్ చేశారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

అయితే, విధి ఎలా వక్రీకరిస్తుందో ఎవరికీ తెలియదు కదా..! సౌందర్య మరణంతో అందర్నీ విషాదంలోకి తోసేసింది. సౌందర్య హటాన్మరణం అందర్నీ ఉలిక్కిపడేలా చేసింది. నటనతో సంబందం లేని వాళ్లు కూడా సౌందర్య సోదరుడు విషాదంలోకి వెళ్లిపోయాడు. ఇదిలా ఉండగా సౌందర్య మరణానంతరం భర్త రఘు 2010లో ఒక లేడీ డాక్టర్‌ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. చాలా సుఖంగా.. సాఫీగా తన జీవితాన్ని గడిపేస్తున్నాడు రఘు. అయితే, రఘు తన విలాసవంతమైన జీవితానికి.. సౌందర్య సినీ ఇండస్ర్టీలో సంపాదించిన డబ్బును బాగా వాడుకుంటున్నాడట. కనీసం సౌందర్య తల్లిదండ్రులను కూడా రఘు అస్సలు పట్టించుకోవట్లేదట. దీంతో వారు దిక్కుతోచని స్థితిలో ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం.

రఘు మాత్రం సౌందర్య సంపాదించిన డబ్బుతో బాగా ఎంజాయ్ చేస్తున్నాడట. అయితే, సౌందర్య పేదలను ఆదుకునేందుకు అనేక ట్రస్ట్‌లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కనీసం ఆ ట్రస్టులకు కూడా రఘు సౌందర్య సంపాదించిన డబ్బును పంపట్లేదట. అటు సౌందర్య తల్లిదండ్రులను పట్టించుకోకుండా. ఇటు పేదల కోసం సౌందర్య స్థాపించిన ట్రస్టులకు నగదును పంపించకుండా.. నెలకోసారి గోవా ట్రిప్‌కు వెళుతూ.. సౌందర్య భర్త రఘు జల్సాలు చేస్తున్నాడట. తమ కళ్లెదుటే ఇదంతా జరుగుతున్నా కూడా సౌందర్య తల్లిదండ్రులు ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారట. ఇప్పుడీ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com