9 వెల్ఫేర్ కమిటీల్ని ఏర్పాటు చేయనున్న ఇండియన్ కాన్సులేట్
- January 11, 2018
దుబాయ్: సమస్యలతో సతమతమవుతున్న ఇండియన్స్ కోసం ఇండియన్ కాన్సులేట్, కమ్యూనిటీ మెంబర్స్ పలు కమిటీలను ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేశారు. దుబాయ్‌లోని ఇండియన్ కాన్సులేట్, కమ్యూనిటీ మెంబర్స్‌తో కలిసి ఈ తొమ్మిది కమిటీలను ఏర్పాటు చేయనుంది. సమస్యలతో సతమతమవుతున్న భారతీయులకు ఈ కమిటీలు ఉపయోగపడనున్నాయని దుబాయ్‌లో భారత కాన్సుల్ జనరల్ విపుల్ చెప్పారు. 16వ ప్రవాసీ భారతీయ దివస్ అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారాయన. సీ ఫేర్స్, జైలు, లీగల్, కల్చరల్, స్టూడెంట్స్, మెడికల్, ఇల్లీగల్ స్టే / ఇమ్మిగ్రేషన్, డెత్ కేసెస్, ఫ్యామిలీ డిస్ప్యూట్స్ / వివాహ సంబంధ వివాదాలను హ్యాండిల్ చేయడానికి వీలుగా ఈ కమిటీల్ని రూపకల్పన చేస్తారు. కాన్సులేట్‌కి అసిస్ట్ చేస్తున్న వాలంటీర్లు, కమ్యూనిటీ లీడర్లు, కాన్సులర్ అధికారుతో కలిసి ఈ కమిటీలను ఏర్పాటు చేస్తారు. ఆరు నెలలకోసారి ఓపెన్ మీటింగ్స్‌ని ఇండియన్ కమ్యూనిటీతో కలిసి నిర్వహిస్తున్నట్లు అధికారులు వివరించారు. 2017లో కాన్సులేట్ పలు వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహించింది. 403 ఎయిర్ టిక్కెట్స్ జారీ చేయగా, 39 మోర్టల్ రిమెయిన్స్ రీపాట్రియేట్ చేశారు. 300 మంది కార్మికులకు సబ్సిస్టెన్స్ అలవెన్స్ అందించారు. 50 మందికి సంబంధించిన జరీమానాలను చెల్లించడం జరిగింది. 1,100 లేబర్ పిర్యాదుల్ని హ్యాండిల్ చేయగా, 86 హాస్పిటల్ కేసుల్ని అసిస్ట్ చేశారు. 230 మంది సెయిలర్స్‌ని రీపాట్రియేట్ చేయడం కూడా జరిగింది.
తాజా వార్తలు
- NEET పేపర్ లీక్ కేసులో 13 మందిపై సీబీఐ అభియోగాలు
- తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు
- యూఏఈలో నెగెటివ్ రివ్యూ పోస్టు చేస్తున్నారా?
- ప్రజల ప్రతి రూపాయి విలువైనదే..ఆర్థిక క్రమశిక్షణలో రాజీ ఉండకూడదు: డీజీపీ సీవీ ఆనంద్
- టెలిగ్రామ్ అధినేత దురోవ్ పై అంతర్జాతీయ ‘వాంటెడ్’ నోటీసు జారీ
- ఆగస్టు 17 నుంచి విశాఖ విమాన ప్రయాణాలు బంద్
- జోర్డాన్ వైమానిక రక్షణ వ్యవస్థల విజయం.. ఇరాన్ నుంచి ప్రయోగించిన ఐదు క్షిపణులు ధ్వంసం
- ఇరాక్ పై అమెరికా, సౌదీ వైమానిక దాడులు...
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు







