'చరిత్ర' తిరగరాసేందుకు పిడికిలి బిగించిన పవర్ స్టార్
- January 11, 2018
పవన్ కల్యాణ్ తాజా సినిమా అజ్ఞాత వాసి ఎన్నో అంచనాల మధ్య రిలీజై.. మిక్సుడు టాక్ తో నిరాశపరిచింది. కాగా అజ్ఞాతవాసి తో పవన్ సినిమాలకు గుడ్ బై చెప్పి..పూర్తి స్థాయిలో రాజకీయ నాయకుడిగా మారతాడు అనేది నిన్నటి వరకూ అందరి అభిప్రాయం.. కానీ తాను ఇంతకు ముందు కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసే పనిలో పవన్ ఉన్నట్లు.. పవన్ నెక్స్ట్ సినిమా తో చరిత్ర తిరగరాసేందుకు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు అనే టాక్ ఫిల్మ్ నగర్ లో హల్ చల్ చేస్తోంది. నిశబ్ధం వీడి ఆయుధం అనే ఉప శీర్షిక తో చరిత్ర అనే టైటిల్ తో పవన్ నెక్స్ట్ సినిమా ఉండనున్నదట.. చరిత్ర పేరుతో పవన్ పిడికిలి బిగించి ఉన్నఓ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తోంది. ఈ సినిమా ముందుగా పవన్ ఏ ఎమ్ రత్నం కు ఇచ్చిన మాట ప్రకారం పట్టాలెక్కనున్నదనే టాక్ వినిపిస్తోంది. అసలు ఈ సినిమా అజ్ఞాతవాసి కంటే ముందే మొదలవ్వాలసి ఉంది.. ఇటీవల ఏ ఎమ్ రత్నం కుమారుడు పవన్ సినిమాపై క్లారిటీ ఇవ్వగా.. అజ్ఞాతవాసి ఆడియో రిలీజ్ వేడుకలో ఏ ఎమ్ రత్నం స్టేజ్ పై పవన్ పక్కన ఉన్నాడు. దీంతో వీరి కాంబోలో సినిమా పక్కా అని ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనున్నదని.. ఫిబ్రవరి లో షూటింగ్ రెగ్యులర్ షూటింగ్ జరుపుకొన్నదని తెలుస్తోంది. కాగా పవన్ సరసన బాలీవుడ్ బ్యూటీ నటిస్తున్నట్లు టాక్
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







