దుబాయ్:వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్లో గెస్ట్ స్పీకర్గా నరేంద్రమోడీ
- January 17, 2018
దుబాయ్:భారత ప్రధాని నరేంద్రమోడీ, వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్లో గెస్ట్ స్పీకర్గా వ్యవహరించనున్నారు. ఫిబ్రవరి 11 నుంచి 13 వరకు జరిగే సమ్మిట్లో ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగిస్తారని మినిస్టర్ ఆఫ్ క్యాబినెట్ ఎఫైర్స్, వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ ఛైర్మన్ మొహమ్మద్ బిన్ అబ్దుల్లా అల్ గెర్గావి చెప్పారు. స్పేస్, డిజిటల్ రివల్యూషన్, హ్యూమన్ రిసోర్సెస్ విభాగాల్లో భారత్ పాత్ర చాలా గొప్పదని అల్ గర్గావి చెప్పారు. ఇండియా నుంచి ఈ విభాగాల్లో యూఏఈ చాలా తెలుసుకోవాల్సి ఉందని ఆయన వివరించారు. భారతదేశం నుంచి పలువురు గౌరవ అతిథులతో కలిసి నరేంద్రమోడీ ఈ కార్యక్రమానికి హాజరవనున్నారు. గతంలో ఈ సమ్మిట్లో సౌత్ కొరియా, అమెరికా, జపాన్ గెస్ట్ కంట్రీస్గా పాల్గొన్నాయి.
తాజా వార్తలు
- NEET పేపర్ లీక్ కేసులో 13 మందిపై సీబీఐ అభియోగాలు
- తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు
- యూఏఈలో నెగెటివ్ రివ్యూ పోస్టు చేస్తున్నారా?
- ప్రజల ప్రతి రూపాయి విలువైనదే..ఆర్థిక క్రమశిక్షణలో రాజీ ఉండకూడదు: డీజీపీ సీవీ ఆనంద్
- టెలిగ్రామ్ అధినేత దురోవ్ పై అంతర్జాతీయ ‘వాంటెడ్’ నోటీసు జారీ
- ఆగస్టు 17 నుంచి విశాఖ విమాన ప్రయాణాలు బంద్
- జోర్డాన్ వైమానిక రక్షణ వ్యవస్థల విజయం.. ఇరాన్ నుంచి ప్రయోగించిన ఐదు క్షిపణులు ధ్వంసం
- ఇరాక్ పై అమెరికా, సౌదీ వైమానిక దాడులు...
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు







