దుబాయ్ నుంచి.. ఎయిర్ ఫ్రాన్స్ మెగా డిస్కౌంట్స్
- January 17, 2018
దుబాయ్:ఫ్రెంచ్ క్యారియర్ ఎయిర్ ఫ్రాన్స్, యూఏఈ వాసులకి మెగా డిస్కౌంట్స్‌ని ప్రకటించింది. 'ఊలాలా' బోనంజా పేరుతో ఈ ఎయిర్‌లైన్, యూరోప్, అమెరికాలకు దుబాయ్ నుంచి విమాన టిక్కెట్లను భారీగా తగ్గించింది. రిటర్న్ ట్రిప్స్‌ని 2,000 దిర్హామ్‌లకే అందించేలా కొత్త ఫేర్స్‌ని ప్రకటించింది. ఎకానమీ క్లాస్‌లో రోమ్‌కి రిటర్న్ ఫ్లైట్స్ 1,450 దిర్హామ్‌లు మాత్రమే. జ్యురిచ్కి వెళ్ళాలంటే 1,750 దిర్హామ్‌లకే పనైపోతుంది. నార్త్ అమెరికాకి వెల్ళాలనుకునేవారికి టోరంటో రౌండ్ ట్రిప్ మరియు మియామీ 3,000 దిర్హామ్‌లకు మించి ఖర్చవదని ఎయిర్ ఫ్రాన్స్ అంటోంది. సౌత్ అమెరికన్ సిటీస్‌కి సైతం అందుబాటు ధరల్లో టిక్కెట్లను అందించనున్నట్లు సంస్థ ప్రకటించింది. జనవరి 9 నుంచి జనవరి 30 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. డిస్కౌంట్ ఫేర్స్తో జనవరి 9 నుంచి జూన్ 10 వరకు ప్రయాణించే వీలు కల్పిస్తోంది ఎయిర్ ఫ్రాన్స్.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







