రస్ అల్ ఖైమా:సిగ్నల్‌లో సాంకేతిక లోపం జరీమానాల రద్దు
- January 17, 2018
రస్ అల్ ఖైమా:అల్ రామ్స్ షమాల్ ట్రాఫిక్ లైట్స్‌లో సమస్యలు తలెత్తాయి. దాంతో రస్ అల్ ఖైమా ట్రాఫిక్ జరీమానాల్ని రద్దు చేసింది. ఈ సమస్య గతంలో ఓ సారి తలెత్తగా, తాజాగా తలెత్తిన సమస్యతో అధికారిక వర్గాలు షాక్‌కి గురయ్యాయి. వాహనదారుల నుంచి రాంగ్ సిగ్నలింగ్‌పై ఫిర్యాదు రావడంతో పరిశీలించిన అధికారులు, సాంకేతిక సమస్యను గుర్తించారు. ఆర్టీరియల్ ఇంటర్సెక్షన్లో రికార్డ్ అయిన అన్ని ఉల్లంఘనలకు సంబంధించిన జరీమానాల్ని రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. రస్ అల్ ఖైమా పోలీస్ కమాండర్ ఇన్ చీఫ్ మేజర్ జనరల్ అలి అబ్దుల్లా బిన్ అల్వాన్ అల్ నౌమి సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ డిపార్ట్మెంట్ కల్నల్ అహ్మద్ సయీద్ అల్ సామ్ అల్ నక్బి చెప్పారు. వరుసగా సిగ్నలింగ్ లోపాలు తలెత్తుతుండడం పట్ల వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గతంలో సాంకేతిక సమస్య తలెత్తినప్పుడు చాలావరకు అంతర్గత పార్ట్స్‌ని రీప్లేస్ చేసినప్పటికీ సమస్య యదాతథంగా పునరావృతం ఆందోళన కలిగిస్తోంది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







