హెల్దీ స్లీప్‌తో హెల్దీ బ్రెయిన్

- May 03, 2015 , by Maagulf
హెల్దీ స్లీప్‌తో హెల్దీ బ్రెయిన్

 

హెల్దీ స్లీప్‌తో హెల్దీ బ్రెయిన్ కొందరు కేవలం నాలుగు గంటల నిద్ర సరిపోతుందని చెబుతుంటారు. ఎక్కువగా నిద్రపోవడం బద్దకస్తుల లక్షణమంటూ పేర్కొంటుంటారు. కానీ కనీసం ఏడు గంటల సంతృప్తికరమైన నిద్ర అవసరం అంటున్నారు సింగపూర్‌లోని డ్యూక్-ఎన్‌యూఎస్ గ్రాడ్యుయేట్ స్కూల్‌కు చెందిన పరిశోధకులు. వీరు ఎంపిక చేసిన దాదాపు 120 మందిపై అనేక న్యూరోసైకలాజికల్ పరీక్షలు నిర్వహించారు. ఎమ్మారై బ్రెయిన్ స్కాన్‌లు తీశారు. రెండేళ్ల పాటు నిర్వహించిన పరీక్షల్లో నిద్రపోయే సమయాన్నీ, నిద్ర నాణ్యతను పరీక్షించాక... సంతృప్తికరమైన నిద్రపోయేవారిలో వయసు పైబడుతున్న కొద్దీ మెదడు శక్తి క్షీణించే రేటు గణనీయంగా తగ్గిపోతుందని తెలిపారు. దాంతో వారి మెదడు యవ్వనంలో ఉన్నప్పటిలాగే ఉంటుందని తేల్చారు. ఒకవేళ తగినంత నిద్రలేకపోతే వయసు పైబడకముందే మెదడుకు వృద్ధాప్యం వస్తుందని హెచ్చరించారు. ఈ పరిశోధన ఫలితాలు 'స్లీప్' అనే మెడికల్ జర్నల్‌లోనూ ప్రచురితమయ్యాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com