సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్‌సిఎం

- January 19, 2026 , by Maagulf
సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్‌సిఎం

రియాద్: సౌదీ అరేబియాలో రాబోయే మూడు రోజులపాటు పలు ప్రాంతాలలో చురుకైన గాలులు వీస్తాయని, ఇది ఇసుక తుఫాన్ లకు కారణం అవుతుందని నేషనల్ సెంటర్ ఫర్ మెటియోరాలజీ (ఎన్‌సిఎం) వెల్లడించింది.

తబూక్, అల్-జౌఫ్, నార్తర్న్ బోర్డర్స్, హైల్ మరియు మదీనా ప్రాంతంలోని ఉత్తర భాగంలో కనిష్ట ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల సెల్సియస్ మరియు -2 డిగ్రీల సెల్సియస్ మధ్య పడిపోతాయని ఎన్‌సిఎం తెలిపింది. అల్-ఖస్సిమ్ మరియు తూర్పు ప్రావిన్స్ మరియు రియాద్ ప్రాంతాల ఉత్తర భాగాలలో ఉష్ణోగ్రతలు 4 డిగ్రీల సెల్సియస్ మరియు 1 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతాయని పేర్కొంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com