గేల్‌ను ఆదుకున్న ప్రీతి

- January 28, 2018 , by Maagulf
గేల్‌ను ఆదుకున్న ప్రీతి

బెంగళూరు: క్రిస్‌ గేల్‌.. ప్రపంచానికి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ట్వంటీ 20ల్లో అమోఘమైన రికార్డు ఈ విధ్వంసకర క్రికెటర్‌ సొంతం. ప‍్రధానంగా సిక్సర్ల కింగ్‌గా పిలుచుకునే గేల్‌... ఈసారి ఐపీఎల్‌ వేలంలో ఎట్టకేలకు అమ్ముడుపోయాడు. గేల్‌ను రూ. 2 కోట్లకు కింగ్స్‌ పంజాబ్‌ చివరి నిమిషంలో దక్కించుకుంది. అతనికున్న కనీస ధరకే కింగ్స్‌ పంజాబ్‌ సొంతం చేసుకుంది.  కింగ్స్‌ పంజాబ్‌ సహ యజమాని ప్రీతిజింతా కనికరించడంతో గేల్‌కు ఊరట లభించినట్లయ్యింది.

శనివారం తొలి రోజు వేలంలో అమ్ముడుపోని గేల్‌.. ఆదివారం రెండో రోజు వేలం ఆరంభంలో కూడా అమ్ముడుపోలేదు.  ఈ రోజు అన్‌సోల్డ్‌ వేలం పాటలో భాగంగా తొలుత గేల్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయడానికి ముందుకు రాలేదు. కాగా, అమ్ముడుపోని క్రికెటర్లకు ఆఖర్లో మరొకసారి వేలం జరగ్గా గేల్‌ను కొనుగోలు చేయడానికి కింగ్స్‌ పంజాబ్‌ ఆసక్తి చూపింది.  అతని కనీస ధర రూ. 2 కోట్లకే కింగ్స్‌ పంజాబ్‌ కొనుగోలు చేసింది. అయితే న్యూజిలాండ్‌ స్టార్‌ ఆటగాడు గప్టిల్‌కు మూడోసారి కూడా నిరాశే ఎదురుకావడం​ గమనార్హం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com