మెగాస్టార్ 152వ సినిమాకు స్క్రిప్ట్ రెడీ
- January 28, 2018
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సైరా నరసింహా రెడ్డి సినిమా చేస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను చిరంజీవి కుమారుడు, హీరో రాంచరణ్ నిర్మిస్తున్నారు. 151వ సినిమాగా తెరకెక్కుతున్న దీన్ని రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై తీస్తున్నారు. అయితే దీని తర్వాత మెగాస్టార్ ఎవరితో సినిమా చేయబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తి కలిగిస్తోంది.
మెగాస్టార్ 150వ సినిమా ఖైదీ నెంబర్ 150 తర్వాత వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఖైదీ సక్సెస్ అయిన వెంటనే ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న సైరా నరసింహారెడ్డి సినిమాను ట్రాక్ లోకి తెచ్చాడు చిరంజీవి. వాస్తవానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితచరిత్ర ఆధారంగా సినిమా తీయాలని చిరంజీవి ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. ఇదే 150వ సినిమాగా తీస్తారనే ప్రచారమూ జోరుగా సాగింది. అయితే అది పట్టాలెక్కలేదు.
ఇంతలో సైరా నరసింహారెడ్డి సినిమాను దర్శకుడు సురేందర్ రెడ్డితో తీయాలని రాంచరణ్, చిరంజీవి భావించడంతో ఖైదీ తర్వాత దీన్ని ఓకే చేశారు. ఇప్పటికే ఓ షెడ్యూల్ కూడా పూర్తయింది. భారీ బడ్జెట్, తారాగణంతో రూపొందుతున్న ఈ సినిమా ముందు అనుకున్నంత వేగంగా ముందుకెళ్లట్లేదు. ఏఆర్ రెహమాన్ ను ముందుగా అనౌన్స్ చేశారు. ఆ తర్వాత కీరవాణి అన్నారు. ఇప్పుడేమో తమన్ మ్యూజిక్ చేస్తున్నాడనే టాక్ నడుస్తోంది. మరోవైపు హీరోయిన్, ఇతర క్రూ పైన కూడా ఇంకా క్లారిటీ రావట్లేదు.
ఇవన్నీ ఇలా ఉండగానే చిరంజీవి నెక్స్ట్ సినిమాపై జోరుగా ఊహాగానాలు ఊపందుకున్నాయి. సైరా నరసింహా రెడ్డి తర్వాత చిరంజీవి కృష్ణవంశీతో సినిమా చేస్తారని మొదట్లో భావించారు. అయితే ఇప్పుడు ఆ లిస్ట్ లోకి లెక్కల మాస్టార్ సుకుమార్ వచ్చి చేరాడు. ప్రస్తుతం రాంచరణ్ తో సుకుమార్ రంగస్థలం సినిమా చేస్తున్నాడు. ఈ సెట్స్ లో చిరంజీవి పలుమార్లు పాల్గొన్నాడు. సుకుమార్ పనితీరు నచ్చిన చిరంజీవి అతడితో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. సుకుమార్ కూడా కథ రెడీ చేసి చిరంజీవికి చెప్పినట్టు సమాచారం. లైన్ బాగుండడంతో మెగాస్టార్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. దీంతో.. చిరంజీవి 152వ సినిమాను సుకుమార్ చేతిలో పెట్టారనే టాక్ వినిపిస్తోంది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







