పూరి చేతిలో రాజ్ తరుణ్

- November 24, 2015 , by Maagulf
పూరి చేతిలో రాజ్ తరుణ్

షార్ట్ ఫిల్మ్స్ తో పాపులర్ అయిన రాజ్ తరుణ్, ఇప్పుడు వరుస హిట్స్ తో తన రేంజ్ ని మరింత పెంచుకున్నాడు..కుమారి 21ఎఫ్ తో కేవలం చిన్న ధర్శకులనే కాకుండా పెద్ద దర్శకుల చేతిలో సైతం పడబోతున్నాడు..పెద్ద హీరోలతో సినిమాలు చేసి చేతులు కాల్చుకోవడం బదులు రాజ్ తరుణ్ లాంటి చిన్న హీరోలతో తక్కువ బడ్జెట్ తో సినిమా పూర్తి చేసి ఎక్కువ లాభాలు తెచ్చుకోవచ్చని చూస్తున్నారు..తాజాగా రాజ్ తరుణ్ వైపు టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి కన్ను పడిందని సమాచారం.. వరుణ్ తేజ్ తో లోఫర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న పూరి, ఇది పూర్తి కాగానే రాజ్ తరుణ్ తో తన సొంత బ్యానర్ లో ఓ సినిమా ప్లాన్ చేస్తునట్లు ఫిలిం సర్కిల్ లో చెపుకుంటున్నారు..నిజంగానే పూరి చేతిలో రాజ్ తరుణ్ పడితే మరో రవితేజ అవడం ఖాయమని అందరు అంటున్నారు..మొత్తానికి రాజ్ తరుణ్ తన టాలెంట్ తో కేవలం ప్రేక్షకులనే కాకుండా అగ్ర దర్శకులను సైతం లైన్ లో పెట్టాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com