కొత్తగా మూడు పధకాలను ప్రారంభించనున్న ఎమిరేట్స్ పర్యావరణ మంత్రిత్వ శాఖ

- November 24, 2015 , by Maagulf
కొత్తగా మూడు పధకాలను ప్రారంభించనున్న ఎమిరేట్స్ పర్యావరణ మంత్రిత్వ శాఖ

 

యు.ఎ.ఈ. పర్యావరణ మంత్రిత్వ శాఖ వారు, ఆ తరహాలోనే కొత్తవైనా  'డ్రాప్ ఆఫ్ లైఫ్',  'బయోలాజికల్ ఫిల్టర్', 'ఇన్నోవేషన్ ఇన్ అగ్రికల్చురల్ వర్క్' అనే మూడు పర్యావరణ హిత పధకాలను ప్రారంభించనున్నట్టు యు.ఎ.ఈ.  సృజనాత్మక వారోత్సవాల సందర్భంగా ప్రకటించారు. నవంబరు 22 న ఎమిరేట్స్ ఉపాధ్యక్షులు మరియు ప్రధాని , దుబాయి పరిపాలకులు ఐన హిజ్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రహిద్ అల్ మక్తౌం వారిచే ప్రారంభిం చబడిన ఈ కార్యక్రమం, నవంబర్ 28 వరకు కొనసాగుతుంది.  'డ్రాప్ ఆఫ్ లైఫ్'- పధకం, గాలి నుండి తేమను గ్రహించి నీటిగా మార్చి, ఆ నీటిని పంటలకు వాడేలా నిర్మించబడింది. 'బయోలాజికల్ ఫిల్టర్' పధకం సేంద్రియ వ్యవసాయంలో ఉత్పత్తి, మార్కెటింగ్, భూసారం మరియు విత్తనోత్పత్తి లో సమర్ధవంతంగా ఉపయోగపడుతుంది. ఇక 'ఇన్నోవేషన్ ఇన్ అగ్రికల్చురల్ వర్క్' అనేది యు.ఎ.ఈ. పౌరులు, నివాసులు మాత్రమే కాకుండా ఇతర దేశాల ప్రజల నుండి కూడా వ్యవసాయ రంగానికి సంబంధించి సృజనాత్మక ఆలోచనలను ఆకర్షించడానికి రుపొందించబడిన ఒక వెబ్ సైట్. ఈ ఆలోచనలు, ఆచరణాత్మకంగా ఎంతమేరకు ఉపయోగపడతాయి అనేది నిపుణులు  విశ్లేషించి, వానిని మంత్రివర్గ సహకారంతో అమలులో పెడతారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com