ప్రత్యేక సౌకర్యాలతో కొత్త రైళ్ళు..!

- November 24, 2015 , by Maagulf
ప్రత్యేక సౌకర్యాలతో కొత్త రైళ్ళు..!

ఇప్పుడు విలాసవంతమైన, ప్రశాంతమైన ప్రయాణం చేసేందుకు ప్రత్యేక సౌకర్యాలతో కొత్త రైళ్ళు అందుబాటులోకి రానున్నాయి. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా తయారైన కొత్త నమూనా రైళ్ళతో.. భోపాల్, బీనా రైల్వే స్టేషన్ల మధ్య శిక్షకులు మొట్ట మొదటి ట్రయల్ రన్ గతవారం నిర్వహించారు. ప్రయాణీకుల కోసం ఈ అదనపు సౌకర్యాలను భోపాల్... నిషాపుత్రాలోని కోచ్ రిహాబిలిటేషన్ వర్క్ షాప్ ఏర్పాటు చేసింది. నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో... 24 కోచ్ లు కలిగి, ప్రస్తుతం ట్రయల్ రన్ వేసిన ఇటువంటి రైళ్ళను ఇండియన్ రైల్వే త్వరలో ప్రయాణీకులకు అందుబాటులోకి తేనుంది. ప్రయాణ సమయంలో బోగీల్లో సామాన్యమైన వాతావరణం కలిగి ఉండేట్లు ఈ కొత్త రైళ్ళలోని సౌకర్యాలను పునరుద్ధరించారు. 2011 లో ఈ ప్రాజెక్టును ప్రారంభించి, వెస్ట్ సెంట్రల్ రైల్వే జోన్ కు ఈ డిజైన్లను రూపకల్పన చేసేందుకు బాధ్యతను అప్పగించారు. మొత్తం 111 కోచ్ లు తయారు చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేయగా... వాటిలో 87 నాన్ ఏసీ కోచ్ లు, ఏసీ త్రీటైర్ కోచ్ లు 17, ఏసీ టూ టైర్ కోచ్ లు 5 తోపాటు ఒక్కో ఏసీ వన్ టైర్ ఛైర్ కార్ ను తయారు చేసేందుకు సిద్ధం చేశారు. ప్రస్తుత ఈ ట్రయల్ రన్ ను రైల్వే బోర్టు అంగీకరిస్తే... వీటిని ఐఎస్ ఓ సర్టిఫైడ్ రైళ్ళలోనూ, రాజధాని ఎక్స్ ప్రెస్ లోనూ పరిచయం చేస్తారు. ఆ తర్వాత ఫేజ్ టు లో లగ్జరీ కోచ్ ల తయారీ ప్రారంభిస్తారు. శతాబ్ది ఎక్స్ ప్రెస్ లో ఎగ్జిక్యూటివ్ క్లాస్ ఛైర్ కార్ కూడ తయారీకి భారతీయ రైల్వే సిద్ధం చేస్తోంది. అంతేకాక బోగీల్లో పర్యావరణ పరిరక్షణలో భాగంగా, రైల్వే ట్రాక్ లపై మానవ వ్యర్థాలను నివారించడంకోసం మరుగుదొడ్ల స్థానంలో బయో టాయిలెట్లను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. అలాగే సీట్లు, బెర్తులు కూడ విశాలంగా, కుదుపులు తెలియకుండా ఉండేట్లు చర్యలు తీసుకున్నారు. సైడ్ బెర్తుల్లో స్నాక్ టేబుళ్ళ స్థానంలో ఇప్పుడు సీట్లనే ప్రత్యేకంగా ఫైర్ ప్రూఫ్ కలిగిన పాలీ వినైల్ పదార్థంతో తయారు చేస్తున్నారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com