భారత్‌లో ఉన్న భిన్నత్వమే సింగపూర్ లోనూ..
- November 24, 2015
భారతీయులు ఐకమత్యం, సమగ్రత అనే మంత్రాలతో ప్రపంచంలో ముందుకు సాగాలని ప్రధాని నరేంద్ర మోడీ సింగపూర్‌లోని భారతీయులకు పిలుపునిచ్చారు. సింగపూర్‌లో తమ రెండు రోజులు అధికారిక పర్యటన ముగింపు సందర్బంగా ఆయన మంగళవారం ఇక్కడ భారతయు లనుద్దేశించి ప్రసంగించారు. ఆయన ఇక్కడి సింగపూర్ ఎక్స్‌పోలో ప్రసంగిం చారు. భారతదేశ అభివృద్ధికి తన ఆకాంక్షలను వెల్లడించడంతో బాటు దేశ గౌరవాన్ని పరిరక్షించడంలో ఐకమత్యం, సామరస్యాల ప్రాముఖ్యతను ఆయన వివరించారు. అభివృద్ధిపై దృష్టి నిలపడం ద్వారా భారతీయుల ఆత్మస్థయిర్యాన్ని పెంచేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఆయన అన్నారు. ఉపాధి కల్పన, రైతుల ప్రగతికి కృషి చేయడం, మహిళా సాధికారత వంటివన్నీ అభివృద్ధిలో భాగమని ఆయన అన్నారు. పేదల కన్నీరు తుడవడమే తన ధ్యేయ మని అన్నారు దాద్రిలో ఆవు మాంసం తిన్నాడన్న కారణంగా కొంత మంది ఒక వ్యక్తిని మథ్య చేసిన అనంతరం దేశంలో అసహనం పెరిగిపోతున్నదని వివాదం చెలరేగి, కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో ప్రధాని మోడీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. భారత గొప్ప దేశం అయితే సింగపూర్ నుంచి నేర్చుకోవలసింది ఎంతో ఉందని ఆయన అన్నారు. 'భారత్‌లో ఉన్న భిన్నత్వమే సింగపూర్ లోనూ ఉంది. ఇక్కడా అందరూ భుజం భుజం కలిసి ఈ దేశాభి వృద్ధికి కృషి చేస్తున్నారు. ఇదే మనం సింగపూర్ నుంచి నేర్చుకోవలసింది' అని ఆయన అన్నారు. విదేశాలలో దేశ ప్రతిష్ఠ ఇటీవల పెరగిందని అంటూ, 'దానికి కారణం మోడీ కాదు విదేశాలలో ఉన్న నా సోదరసోదరీమణులైన మీరే' నని అన్నారు భారతీయులు ఎక్కడికెళినా అక్కడ సమాజంలో కలిసోతుంటారని వారు ప్రపంచమంతా ఒకే కుటుంబం అనే వసుధైక కుటుంబకం అనే సూత్రాన్ని పాటిస్తుంటారని అన్నారు. ఆయన అంతకు ముందు మలేషియా నుంచి సింగపూర్ చేరుకున్నారు.ఆయన ఇక్కడి ఆగ్నేయాసియా దేశాల అధ్య యన సంస్థలో ప్రసంగించనున్నారు. సింగపూర్‌లోని ఈ సంస్థలో ప్రసంగించే అవకాశం పేరెన్నికగన్న రాజకీయ వేత్త్తలకు, నాయకులకు, పలు రంగాల్లో నిష్ణాతులు వంటి వారికే లభిస్తుంది. కాగా అంతకు ముందు మోడీ మలేషియా ప్రధాని నజీబ్‌తో ఒక సంయుక్త ప్రకటన విడుదల చేసిన అనంతరం అక్కడి నుంచి బయలుదేరారు. అంతకు ముందు ఆయన నజీబ్‌తో కలిసి లిటిల్ ఇండియాగా పిలిచే కౌలాలంపూర్‌లోని బ్రిక్స్ఫీల్డ్ ప్రాంతంలో బౌద్ధ ఆలయా లకు దారితీసే ద్వారమైన తోరణ గేట్‌ను ప్రారంభించారు.
తాజా వార్తలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్‌లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్‌లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!
- గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్–2025 అవార్డు గ్రహీతల ప్రకటన
- కేటీఆర్ విచారణ..జూబ్లీహిల్స్ PS వద్ద ఉద్రిక్తత
- వరల్డ్ ఇన్వెస్ట్ మెంట్ ఫోరమ్ 2026కు ఖతార్ హోస్ట్..!!
- సౌదీలో రెసిడెన్స్ ఉల్లంఘనలు..19,559మందికి ఫైన్స్..!!







