దక్షిణ అమెరికా ఖండంలో భారీ భూకంపం
- November 24, 2015
దక్షిణ అమెరికా ఖండంలోని పెరూలో భారీ భూకంపం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5:45 గంటల నుంచి దాదాపు అరగంటపాటు భూమి కంపించింది. భూ ఉపరితలానికి 602 కిటోమీటర్ల లోతులో సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.5 గా నమోదయింది. ప్రాణ, ఆస్తి నష్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా, పెరూ భూకంపంతో లాటిన్ అమెరికా దేశాలన్నీ చిగురుటాకుల్లా వణికిపోయాయు. బ్రిజిల్, బొలీవియా, చిలీ, కొలంబియా, ఈక్వెడార్, అర్జెంటీనాల్లోనూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయని స్థానిక మీడియా రిపోర్ట్ చేసింది. అయితే భూకంప కేంద్రం భూతలానికి చాలా లోతులో ఉండటం వల్ల నష్టతీవ్రత అంతగా ఉండకపోవచ్చని నిపుణులు అంచనావేస్తున్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







