కొత్త బస్ రూట్‌ని ప్రకటించిన మవసలాట్
- February 02, 2018
మస్కట్: ఒమన్ నేషనల్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ (మవసలాట్), మస్కట్ నుంచి ముసాన్నాకి బార్కా మీదుగా కొత్త పబ్లిక్ బస్ రూట్‌ని ప్రకటించింది. ఫిబ్రవరి 2 నుంచి ఈ బస్ సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు ఈ బస్సులు సేవల్ని అందిస్తాయి. కొత్త బస్ రూట్ 42, సౌత్ అల్ బతినా గవర్నరేట్‌కి సేవలు అందిస్తుంది. సుల్తానేట్‌లో ఎక్కువమంది టూరిస్టులకు ఈ రూట్ అవసరమవుతుంది. మిలీనియం రిసార్ట్ సహా పలు పర్యాటక ప్రాంతాలు ఇక్కడ ఉన్నాయి. వారందరికీ కొత్త బస్ రూట్ ఉపయుక్తంగా ఉంటుందని మవసలాట్ ప్రతినిథులు పేర్కొన్నారు. కొత్త రూట్ ప్రారంభిస్తున్నందుకు ఆనందంగా ఉందని మవసలాట్ పేర్కొనగా, బస్ రూట్‌తో తమకు సౌకర్యంగా ఉంటుందని ప్రయాణీకులు అంటున్నారు.
తాజా వార్తలు
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..







