సిట్రా సెంట్రల్ మార్కెట్‌ని సందర్శించిన గవర్నర్
- February 02, 2018
మనామా: సిట్రా సెంట్రల్ మార్కెట్‌ని మరింత ఆధునీకరించేందుకు, అక్కడ సౌకర్యాలు మెరుగుపరిచేందుకు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో క్యాపిటల్ గవర్నరేట్ గవర్నర్ షేక్ హిషామ్ బిన్ అబ్దుల్‌రహ్మాన్ అల్ ఖలీఫా, మార్కెట్‌ని సందర్శించారు. క్యాపిటల్ ట్రస్టీస్ బోర్డ్ డైరెక్టర్ జనరల్ షేక్ మొహమ్మద్ బిన్ అహ్మద్ అల్‌ఖలీఫా, క్యాపిటల్ పోలీస్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ ఖాలిద్ అల్ ధవాది, మినిస్ట్రీకి సంబంధించిన పలువురు అధికారులు గవర్నర్ వెంట ఈ పర్యటనలో ఉన్నారు. మార్కెట్‌కి సంబంధించి అత్యవసర విషయాలపై గవర్నర్ తెలుసుకున్నారు. ప్రైమ్ మినిస్టర్‌క్రౌన్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా నేతృత్వంలోని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ సిట్రా మార్కెట్ విషయమై తీసుకున్న నిర్ణయాన్ని గవర్నర్ అభినందించారు. పౌరుల నుంచి మార్కెట్‌కి సంబంధించి అభిప్రాయాలు తెలుసుకోవడం, అలాగే కొన్ని ఇబ్బందుల్ని తొలగించడం సహా పలు అంశాలపై గవర్నర్ ఈ సందర్భంగా చర్చించారు. మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్ మరియు మునిసిపల్ ఎఫైర్స్ అలాగే అర్బన్ ప్లానింగ్ మార్కెట్ అప్‌డేట్‌కి సంబంధించి తయారు చేసిన ప్లాన్స్‌ని రివ్యూ చేశారు గవర్నర్.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







