నటన మాత్రం అస్సలు నేర్చుకోలేదు అంటూన్నరాజశేకర్ కూతురు
- February 04, 2018
సినిమా : సీనియర్ నటుడు రాజశేఖర్ పెద్ద కూతురు శివాని త్వరలో టాలీవుడ్ అరంగ్రేటం చేయబోతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ హిట్ మూవీ టూ కంట్రీస్ రీమేక్‌లో అడివి శేష్ సరసన ఆమె నటించబోతోంది. అయితే నటనలో ఎలాంటి శిక్షణ తీసుకోకుండానే ఆమె సిద్ధమైపోతుండటం విశేషం.
సాధారణంగా సెలబ్రిటీలు తమ తమ వారసులను నటనతోపాటు మిగతా వాటిల్లో కూడా శిక్షణ ఇప్పిస్తుంటారు. కానీ, శివానీ మాత్రం కేవలం డాన్సుల్లో మాత్రమే శిక్షణ తీసుకుందంట. బెల్లీ డాన్సులు, కథక్‌లో ఆమె ప్రావీణ్యం సంపాదించేసుకుంది. మరి నటనలో ఎందుకు శిక్షణ తీసుకోలేదని ఆమె ప్రశ్నిస్తే ఆమె ఇచ్చే సమాధానం ఏంటో తెలుసా?
తన పేరెంట్స్ ఎలాంటి శిక్షణ తీసుకోకుండానే నటనలో రాణించి స్టార్లు అయ్యారని.. చిన్నప్పటి నుంచి వారినే చూస్తూ పెరిగా కాబట్టి తనకు ఆ అవసరం లేదు అని ఆమె చెబుతోంది. మరి జీవితా-రాజశేఖర్ లాగే ఆమె కూడా సహజంగా నటించి మంచి పేరు తెచ్చుకుంటుందేమో! చూద్దాం.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







