మయన్మార్‌లో ప్రమాదకర స్థాయిలో హింస
- February 10, 2018
మయన్మార్‌లో రోహింగ్యా ముస్లింలపై కొనసాగుతున్న హింస ప్రమాదకరస్థాయిలో వుందని ఐరాస ఆందోళన వ్యక్తం చేసింది. మయన్మార్‌లో కొనసాగుతున్న హింసాకాండపై ఒక మీడియా సంస్థ దర్యాప్తు చేసిన వార్తా కథనంపై స్పందించిన ప్రపంచ సంస్థ ప్రతినిధి ఫర్హాన్ హక్ శనివారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రఖినే రాష్ట్రంలో రోహింగ్యా ముస్లింలపై కొనసాగుతున్న హింసాకాండ విషయంలో సమగ్ర దర్యాప్తు జరిపించాల్సిన అవసరం వుందని అన్నారు. మయన్మార్ ప్రభుత్వం అరెస్ట్ చేసిన ఇద్దరు జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ డిమాండ్ చేశారని, వారిని విడుదల చేసే వరకూ తాము మయన్మార్‌పై వత్తిడి కొనసాగిస్తామని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







