మగ వారికి క్యాన్సిలేషన్ ఛార్జీలు రద్దు
- February 10, 2018
మాల్దీవుల అంతర్గత సంక్షోభం నేపథ్యంలో బడ్జెట్ క్యారియర్ స్పైస్‌జెట్ కీలక నిర్ణయం తీసుకుంది. మాల్దీవుల రాజధాని మాలే నుంచి, మాలేకు ప్రయాణించే వారికి క్యాన్సిలేషన్, ఇతర ఛార్జీలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఫిబ్రవి 8 నుంచి 14 వరకు తమ ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని పేర్కొంది. ''ఫిబ్రవరి 8 నుంచి 14 వరకు మాలే నుంచి లేదా మాలేకు ప్రయాణించే ప్రయాణికులు తమ టిక్కెట్ల క్యాన్సిలేషన్‌ను చేపట్టుకోవచ్చు. మొత్తం టిక్కెట్ ఛార్జీలను రీఫండ్ చేస్తాం. క్యాన్సిలేషన్ ఛార్జీలను రద్దు చేశాం'' అని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.
ప్రస్తుతం మాల్దీవుల్లో నెలకొన్న అంతర్గత సంక్షోభం నేపథ్యంలో ప్రయాణం చేయడం ఇష్టం లేని ప్రయాణికులకు, మొత్తం రీఫండ్ చేస్తామని చెప్పింది. గురువారం ఎయిర్ ఇండియా కూడా ఈ ఛార్జీలను రద్దు చేసింది. మాల్దీవుల్లో ప్రస్తుతం అత్యయిక పరిస్థితి నడుస్తోంది. దీనిపై ప్రపంచ అగ్రనేతలందరూ ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థి, మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ నషీద్‌తోపాటు మరో ఎనిమిది మంది చట్టసభ సభ్యులను జైలు నుండి విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను ప్రస్తుత అధ్యక్షుడు పట్టించుకోకపోవడం, న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయాలని దేశీయంగా ప్రజలు ఉద్యమించడం, భారత్, అమెరికా సహా పలు దేశాలు యమీన్‌పై ఒత్తిడి తేవడంతో మాల్దీవులు రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయింది.
తాజా వార్తలు
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!







