తొలిప్రేమ మూవీ సూపర్ కేటీఆర్ ప్రశంసలు
- February 11, 2018
సినిమా ఎవరికైనా రిలాక్స్ కలిగించే సాధనమే..! బిజీలైఫ్ నుంచి రిలాక్స్ కోసం సినిమాలను సెలబ్రిటీలు కూడా చూస్తారు. ఇక తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అయితే సినిమాలంటే ఆసక్తి.. ఇంత బిజీలైఫ్ లో కూడా సినిమాలను చూస్తూ.. నచ్చితే ఆ సినిమాలపై ప్రశంసల వర్షం కురిపిస్తుంటారు. కాగా తాజాగా వరుణ్ తేజ్ నటించిన తొలిప్రేమ సినిమాను రిలీజ్ రోజునే మంత్రి కేటీఆర్ చూశారట. సినిమా చాలా బాగా నచ్చింది అని తన ట్విట్టర్ ద్వారా చెప్పారు. శనివారం రాత్రి చాలా చాలా బాగా గడిచింది. తెలుగులో చాలా రోజుల తర్వాత వచ్చిన సున్నితమైన ప్రేమ కథా చిత్రం.. తొలిప్రేమ. ఈ సినిమా చిత్ర యూనిట్ అద్భుతంగా సినిమాను తెరకెక్కించింది అని కేటీఆర్ ప్రశంసించారు. వరుణ్, రాశీ ఖన్నాలు బాగా నటించారు. సినిమాలో పాటలు బాగున్నాయి. వెంకీ అట్లూరి సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు అని కేటీఆర్ ట్వీట్ చేశారు. కేటీఆర్ ట్వీట్ కు స్పందించిన థమన్ ధన్యవాదలు తెలియజేస్తూ... మా అభిమాన నాయకుడి నుంచి వచ్చిన ప్రశంసలతో మా టీం చాలా సంతోషంగా ఉంది అని సంగీత దర్శకుడు థమన్ ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!







