మోడీ సందర్శనతో మరింత మెరుగుపడనున్న యుఎఇ-ఇండియా సంబంధాలు
- February 11, 2018
అబుదాబి: అబుదాబిలో రెండు రోజుల పర్యటన సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడి శనివారం సాయంత్రం ఇక్కడకు వచ్చారు. భారత ప్రధానిని అబుదాబి క్రౌన్ ప్రిన్స్ మరియు యూఏఈ సాయుధ దళాల డిప్యూటీ సుప్రీం కమాండర్ గౌరవనీయ షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఘనంగా స్వాగతించారు. షేక్ మహ్మద్ బిన్ జాయెద్ మోడీ ఇద్దరు నాయకులు ఒకరినొకరిని కౌగిలించుకొని ఆనందాలను పంచుకోన్న ఫోటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేసి అందరికి చూపించారు. మోడీకి ఆయన ఆచారబద్ధంగా రిసెప్షన్ ఇచ్చారు. మోడి సైతం రాష్ట్రపతి ప్యాలెస్ లో అబుదాబి క్రౌన్ ప్రిన్స్ నిర్వహించిన రాష్ట్ర విందుకు హాజరయ్యారు. యుఎఇకి భారత ప్రధాని మోడీ రావడం ఇది రెండవ పర్యటన. యుఎఇ-ఇండియా సంబంధాలలో కొత్త ఊపందుకోనుంది మరియు రెండు దేశాల మధ్య పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడం ప్రధాన లక్ష్యం కానుంది. రక్షణ, ఆర్థిక, పెట్టుబడులు, తీవ్రవాద వ్యతిరేక, అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం, మౌలిక సదుపాయాలు, నైపుణ్యాల అభివృద్ధి వంటి అయిదు అంశాలపై ప్రభుత్వం సంతకాలు చేసింది. ఇంధన రంగం, రైల్వేలు, మానవ వనరులు, ఆర్థిక సేవలకు సంబంధించి శనివారం ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. భారతీయ కన్సార్టియం (ఒవిఎల్, ఐ ఓ సి ఎల్) మరియు అడనోక్ ఆఫ్షోర్ లోయర్ జాకుమ్ రాయితీలో 10 శాతం పొందేలా ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. 2018 నుండి 2057 వరకు 40 సంవత్సరాల వరకు ఈ రాయితీలు కోనసాగుతాయి, ఈ ఒప్పందంలో అడానోక్ 60 శాతం పాల్గొంటుంది, మిగిలిన 30 శాతం ఇతర అంతర్జాతీయ చమురు కంపెనీలకు అవకాశం ఇస్తారు. మొట్టమొదటిసారిగా భారతీయ పెట్టుబడులు యుఎఇ ఎగుమతుల చమురు క్షేత్రంలో పెట్టింది. దీంతో దీర్ఘకాలిక పెట్టుబడిదారుల సంబంధానికి సాంప్రదాయ కొనుగోలుదారు-విక్రేత సంబంధాన్ని మార్చివేసింది. యుఎఇ లో భారత రాయబారి నవదీప్ సింగ్ సూరి ఈ సందర్భంగా " మా గల్ఫ్ డాట్ కామ్ " తో మాట్లాడుతూ, "అద్నోక్ తో ఒప్పందం ప్రకారం భారతదేశంలో మొట్టమొదటి వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలను భద్రపరిచే మంగళూరులో అడానోక్ ఆరు మిలియన్ బారెల్స్ నిల్వలతో చమురు బాండారంగా మార్చనుంది. ఇప్పటివరకు జరిగిన అనేక ఒప్పందాలలో ఇది మొదటిదిగా ఉంటుందని నేను ఆశిస్తున్నానని ఆయన అన్నారు. అదేవిధంగా యూఏఈ లో మానవ వనరుల రంగంలో అవగాహన ఒప్పంద పత్రం ప్రకారం సంయుక్తంగా భారతీయ కార్మికుల కాంట్రాక్టు ఉద్యోగాలను కొనసాస్తుంది. ఒప్పందం ప్రకారం, ఇరుపక్షాలు తమ కార్మిక సంబంధిత ఇ- వేదికలను ఉపయోగించుకొని ఇప్పటికే ఉన్న దుష్ప్రచారాలు తిప్పికొట్టాలని సూచిందారు, మానవ అక్రమ రవాణాకు అంతరాయం కలిగించాలని , కాంట్రాక్ట్ కార్మికులపై విద్య ,అవగాహన కోసం సమిష్టి కార్యక్రమాలను నిర్వహించడానికి ఇరుదేశాలు సమిష్టిగా పని చేస్తాయి.అలాగే , రైల్వే రంగంలో ఉమ్మడి ప్రాజెక్టులు, జ్ఞాన భాగస్వామ్యం, ఉమ్మడి పరిశోధన మరియు సాంకేతిక బదిలీల అభివృద్ధికి ఒక అవగాహన ఒప్పంద పత్రంపై సంతకం చేసింది. బొంబాయి స్టాక్ ఎక్సేంజ్ (బిఎస్ఇ), అబుదాబి సెక్యూరిటీస్ ఎక్చేంజ్ (బిఎస్ఇ) ఏ డి ఎక్స్) సంతకం మరియు మార్పిడి చేయబడింది. ఆర్ధికరంగంలోని రెండు దేశాల పరస్పర ప్రయోజనం కోసం సమాచార మార్పిడి, నిపుణుల మార్పిడి మరియు శిక్షణను ఆ అవగాహనపత్రంలో అవకాశం కల్పిస్తుంది. జమ్మూ కాశ్మీర్ మరియు డిపి వరల్డ్ ప్రభుత్వానికి మధ్య ఉన్న ఒక అవగాహన కూడా జరిగింది. జమ్మూలో గిడ్డంగులు మరియు ప్రత్యేకమైన నిల్వ పరిష్కారాలను కలిగి ఉన్న బహుళ మోడల్ లాజిస్టిక్స్ పార్కు మరియు కేంద్ర స్థాపనకు సంతకం చేసింది. రెండు దేశాలు మోడీ చారిత్రక పర్యటన సందర్భంగా 14 ఒప్పందాలు మరియు ద్వైపాక్షిక ఒప్పందాలపై సంతకాలు చేయాలని ఇరుదేశాలు భావిస్తున్నాయి. ఆదివారం వహత్ అల్ కరమా, యూఏఈ లోని అమరవీరుని స్మారకాన్ని సందర్శిస్తారు. అనంతరంలో దుబాయ్ కి వెళతారు. అతను దుబాయ్ ఒపేరాలో జరిగిన ఒక కార్యక్రమంలో భారత కమ్యూనిటీతో పరస్పరం చర్చలు జరుపుతారు .యూఏఈ పాలకుడు , వైస్ ప్రెసిడెంట్ మరియు దుబాయ్ ప్రధాని షైక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్, లో 6 వ వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ లో పాల్గొంటారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి