డ్రగ్ పెడ్లర్కి ఐదేళ్ళ జైలు
- February 15, 2018
మనామా: బహ్రెయినీ డ్రగ్ పెడ్లర్కి ఐదేళ్ళ జైలు శిక్ష విధించింది ఫస్ట్ హై క్రిమినల్ కోర్టు. అలాగే 500 బహ్రెయినీ దినార్స్ జరీమానా కూడా విధించడం జరిగింది. మెథాంఫెటమైన్ అనే డ్రగ్ (స్థానికంగా షబు అని పిలుస్తారు) విక్రయిస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పోలీసులకు పట్టుబడ్డాడు నిందితుడు. జుఫైర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. 280 దిర్హామ్‌ల విలువైన డ్రగ్‌ని నిందితుడు విక్రయించాడు. విచారణలో నిందితుడు, మరో డ్రగ్ పెడ్లర్కి సంబంధించిన సమాచారాన్నీ అందించాడు. ఈ నేపథ్యంలో అతన్నీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండో నిందితుడికి ఏడాది జైలు శిక్ష అలాగే 500 బహ్రెయినీ దినార్స్ జరీమానాని ఖరారు చేసింది న్యాయస్థానం. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులకు కూడా ఏడాది జైలు శిక్ష, 500 దిర్హామ్‌ల జరీమానా విధించడం జరిగింది.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







