సైనికులతో.. గేమ్‌లోకి దిగిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్
- February 20, 2018
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్తచిత్రం 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'. కె నాగబాబు సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్లో శిరీష శ్రీధర్ నిర్మాతగా, బన్నీ వాసు సహ నిర్మాతగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బన్నీ సరసన అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్గా నటిస్తోంది. చిత్రంలో బన్నీ ఆర్మ్ ఆఫీసర్ పాత్రలో దర్శనమీయనున్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ఇండో-పాక్ సరిహద్దు ప్రాంతంలో జరుగుతోంది. చిత్రానికి సంబంధించిన ముఖ్య సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు.
అయితే షూటింగ్లో భాగంగా సెట్స్‌పై బన్నీ.. అక్కడి సైనికులతో వాలీబాల్ ఆడి తెగ సందడి చేశారు. ఈ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు బన్నీ. ఓ సైనికుడి గెటప్ లో బన్నీ వాలీబాల్ ఆడుతుండటం మెగా అభిమానులకు కన్నుల పండుగ అయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను ఊపేస్తూ లైకులు, షేర్స్‌తో దూసుకుపోతోంది.
ఏప్రిల్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్, శరత్ కుమార్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, లిరికల్ సాంగ్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి