'వీరప్పన్' కి అడ్డంకులు
- November 26, 2015
తమ అనుమతిలేనిదే 'కిల్లర్ వీరప్పన్' సినిమా విడుదల చేయరాదని వీరప్పన్ సతీమణి ముత్తులక్ష్మి డిమాండ్ చేశారు. గురువారం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ... కిల్లర్ వీరప్పన్ సినిమాను హిందీలో తెరకెక్కించడానికి మాత్రమే తన నుంచి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అనుమతి పొందారని చెప్పారు. అయితే కన్నడ, తమిళ భాషల్లో సినిమా తీయడానికి అనుమతి పొందలేదని ఆమె స్పష్టం చేశారు. కిల్లర్ వీరప్పన్ సినిమాను హిందీ, తమిళ భాషల్లో మాత్రమే విడుదల చేయాలన్నారు. అదికూడా మొదట తాను కిల్లర్ వీరప్పన్ చిత్రం చూసిన తరువాతేనే ఆ సినిమా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కిల్లర్ వీరప్పన్ అనే సినిమా టైటిల్ అభ్యంతరంగా ఉందని ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు వీరప్పన్ ను అవహేళనగా చూపించినట్లు తెలుస్తోందన్నారు. ఈ సినిమాలో వీరప్పన్ ను చెడుగా చూపించినట్లైతే ఆ ప్రభావం కుటుంబ సభ్యులపై పడుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. కిల్లర్ వీరప్పన్ సినిమాను అడ్డుకోవడానికి కోర్టు అనుమతి పొందామని తెలిపారు. 2006 సంవత్సరంలోనే రూ. 31 లక్షలు ముత్తులక్ష్మికి అందించి కిల్లర్ వీరప్పన్ సినిమా హక్కులు పొందామని అట్టహాస కన్నడ సినిమా డైరెక్టర్ ఎ.ఎమ్.రమేశ్ తెలిపారు. కన్నడ, తమిళ భాషల్లో కిల్లర్ వీరప్పన్ సినిమా చిత్రీకరణ పూర్తి చేసి విడుదల చేసే సమయంలో కేసు పెట్టి ఇలా అడ్డంకులు సృష్టించడం విడ్డూరంగా ఉందని రమేశ్ వాపోయారు.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







