వసంతం

- November 26, 2015 , by Maagulf

 
ఒక్కసారి నువ్వు ఒప్పందం కుదుర్చుకొని 
సిగ్గుతో తలవంచుకున్నాక
ఇక వెనక్కి తిరిగి చూడవు ..
రోజులు సంవత్సరాలుగా రూపాంతరం చెంది 
రాజులు రాజ్యాలు అన్నీ మారి పోతాయి
నువ్వు మాత్రం అక్కడే నీ ' తాళి ' గీసిన 
" వివాహ బాంధవ్య " నాలుగ్గోడల మధ్యలో
నేనే చంచల మేఘమై వెళ్ళి అచంచల కోర్కెల
నడుమ, అస్థిర భావమై ఎక్కడో కరిగి పోతుంటాను
నిను నిర్లక్ష్యం చేసి,
నువ్వేమో నేను చేసే ప్రతీ అలక్ష్యపు పనుల్నీ 
ఓ పసివాడి ఆటలు గానే జమ కట్టి ..
కుటుంబ భారమే నీ పరమార్ధంగా ఎంచుకొని 
' సహన శీలివై ' మెప్పులేవి కోరకుండా 
ఎదురు చూస్తావు మన వసంతం రాకకై..

 

--జయ రెడ్డి బోడ(అబుధాబి) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com