ఆర్య హీరోగా 'గజినికాంత్' చిత్రీకరణ పూర్తి
- February 20, 2018
చెన్నై, న్యూస్‌టుడే: జ్ఞానవేల్‌రాజా నిర్మాణంలో స్టూడియోగ్రీన్ బ్యానరుపై ఆర్య హీరోగా నటిస్తున్న చిత్రం 'గజనికాంత్'. సాయేషా కథానాయిక. బాలమురళి బాలు సంగీతం సమకూర్చుతున్నారు. కరుణాకరన్, సతీష్, కాళివెంకట్, రాజేంద్రన్, సంపత్‌లు ఇతర తారాగణం. తెలుగులో విజయం సాధించిన 'భలే భలే మగాడివోయ్'కి ఇది రీమేక్. 'ధర్మత్తిన్ తలైవన్' చిత్రంలోని రజనీకాంత్ గెటప్‌లో ఆర్య ఉన్నట్లు ఇటీవల ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. దీనికి మంచి స్పందన వచ్చింది. ఇదిలా ఉండగా సినిమా చిత్రీకరణ కొన్నిరోజుల క్రితమే పూర్తయింది. దీంతో డబ్బింగ్ పనులను ప్రారంభించారు. నగరంలోని నాక్ స్టూడియోస్‌లో ప్రస్తుతం డబ్బింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మార్చిలో ఆడియోను విడుదల చేసి ఏప్రిల్‌లో చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్







