దుబాయ్‌లో గల్ఫ్‌ ఫుడ్‌ ట్రేడ్‌ షో

- February 20, 2018 , by Maagulf
దుబాయ్‌లో గల్ఫ్‌ ఫుడ్‌ ట్రేడ్‌ షో

దుబాయ్‌:రాష్ట్రంలో 100 ఎకరాల విస్తీర్ణంలో మాంసం ఎగుమతి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు లూలూ ఇంటర్నేషనల్‌ సంస్థ అంగీకరించింది. గల్ఫ్‌ ఫుడ్‌ట్రేడ్‌ షోలో పాల్గొనేందుకు దుబాయ్‌ వెళ్లిన పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ మంగళవారం లూలూ ఇంటర్నేషనల్‌ సంస్థ సీఈవో, కో-డైరెక్టర్‌లతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఒప్పందం కూడా కుదిరిందని మంత్రి వెల్లడించారు. హైదరాబాద్‌ నగర శివార్లలో ఏర్పాటు చేసే మాంసం ఎగుమతి కేంద్రం ద్వారా ప్రత్యక్షంగా 800 మందికి, పరోక్షంగా 5 వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. రాష్ట్రంలో మాంసం, పాల ఉత్పత్తి, పౌలీ్ట్ర రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు గల అవకాశాలను విదేశీ సంస్థలకు తలసాని వివరించారు.

రాష్ట్రం నుంచి ఎగుమతి చేసే మాంసం నాణ్యతలో అన్ని నిబంధనలూ పాటిస్తున్నామన్నారు. రాష్ట్రం నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 420 టన్నుల గొర్రె మాంసం, 59,800 టన్నుల గేదె మాంసాన్ని విదేశాలకు ఎగుమతి చేశామన్నారు. మాంసం ఉత్పత్తి రంగంలో పెట్టుబడులకు రాష్ట్రం అన్ని విధాలుగా అనుకూలమని, సంస్థలను ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని విదేశీ సంస్థల ప్రతినిధులను ఆహ్వానించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2.18 లక్షల యూనిట్ల గొర్రెలను పంపిణీ చేశామని, వాటికి 15 లక్షలకు పైగా గొర్రె పిల్లలు జన్మించాయని తెలిపారు.

ప్రతి జిల్లా కేంద్రంలో ఓ మీట్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ను ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యంలో(పీపీపీ) ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ ప్రక్రియలో ప్రభుత్వం భూమి ఇస్తుందని, ఆ భూమిలో కంపెనీలు కర్మాగారాలు ఏర్పాటు చేసుకుని మాంసం ఉత్పత్తి చేసుకోవచ్చని వివరించారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం సింగిల్‌ విండో అనుమతులు ఇస్తోందని, 24 గంటల విద్యుత్తు సరఫరా, నీరు, మానవ వనరుల లభ్యత వంటి అంశాలు రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. కాగా..

దేశం నుంచి మాంసం, చికెన్‌, కోడిగుడ్లు, పాల ఉత్పత్తులకు సంబంధించి వంద స్టాళ్లు ఏర్పాటు చేశామని తలసాని వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com