ఘాజీ' తీసిన సంకల్ప్ రెడ్డితో అహం బ్రహ్మాస్మి అంటున్న మెగాహీరో
- February 21, 2018
తొలిప్రేమతో హిట్టు కొట్టిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. ఇప్పుడు ఘాజీ' తీసిన సంకల్ప్ రెడ్డితో సైన్స్ ఫిక్షన్ కథాంశంతో ఓ సినిమాలో నటించబోతున్నాడు. 'మే నెల నుండి ఈ మూవీ ప్రారంభంకానుంది. అహం బ్రహ్మాస్మి అనే డిఫరెంట్ టైటిల్ ఈ సినిమాకు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. చిత్ర దర్శకుడు ఈ టైటిల్ ను సినిమాకు ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి. తెలుగులో ఇంత వరకు రాని విధమైన కథాంశం తో ఈ సినిమా తెరకెక్కబోతోంది.
ఘాజీ' తో అద్భుతం చూపించాడు కొత్త దర్శకుడు సంకల్ప్ రెడ్డి. అసలు ఇండియన్ సినిమాలోనే ఎవరూ టచ్ చేయని జోనర్ సినిమా తీసి శభాష్ అనిపించాడు. తొలి సినిమాతోనే జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సంకల్ప్ రెండో సినిమపై సహజంగానే మంచి అంచనాలు నెలకొంటాయి. ఈ సినిమా కూడా డిఫరెంట్ జోనర్ లో ఉండబోతుందని భోగట్టా.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







