ఫేస్బుక్ సృష్టికర్తకే షాక్ ఇచ్చిన కేరళ కుట్టి ప్రియా ప్రకాశ్ వారియర్
- February 21, 2018
ఫేస్బుక్ సృష్టికర్తకే షాక్ ఇచ్చిన కేరళ కుట్టి ప్రియా ప్రకాశ్ వారియఒక్క కన్ను కొట్టి కోట్లాది అభిమానుల మనసు గెలుచుకున్న కేరళ కుట్టి ప్రియా ప్రకాశ్ వారియర్. ఒరు ఆదార్ లవ్’ మళయాళ చిత్రంలోని పాట ‘మాణిక్య మలరాయ పూవీ’ పాటతో రాత్రికి రాత్రే స్టార్ స్టేటస్ సంపాందించుకుంది. రోజురోజుకి ఈ అమ్మడిని ఫాలో అయ్యే వారి సంఖ్య మరింత పెరుగుతూ వస్తుంది. ఫాలోవర్స్ పరంగా ఇప్పటికే సన్నీలియోన్, కత్రినా కైఫ్ వంటి సెలబ్రిటీలని క్రాస్ చేసిన ప్రియా వారియర్ తాజాగా ఫేస్బుక్ సృష్టికర్త జుకర్‌బర్గ్‌ని మించిపోయింది. ఆయనికి ఇన్‌స్టాగ్రామ్‌లో 4 మిలియన్ల ఫాలోవర్స్ ఉంటే, ఈ 18 ఏళ్ళ కేరళ కుట్టికి 4.5 మిలియన్ల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆమె ఏదైన ఫోటో పోస్ట్చేసిన లేదంటే వీడియో అప్లోడ్ చేసిన మిలియన్స్‌కి పైగా లైకులు, వ్యూస్ వస్తున్నాయి. సోషల్ మీడియా సంచలనంగా మారిన ప్రియా రోజురోజుకి ఎవరికి అంతనంత ఎత్తుకి ఎదుగుతుంది. ఈ అమ్మడికి పలు సినిమాలలో ఆఫర్స్ కూడా క్యూ కడుతున్నాయి. టాలీవుడ్లో నిఖిల్ సరసన నటించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుండగా , దీనిపై క్లారిటీ రావలసి ఉంది.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్‌కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్‌లో భారత పాస్‌పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్‌లో భారత రాయబారి విపుల్‌కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







