దేశ తొలి మహిళా ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ పైలట్‌గా అవని చతుర్వేది
- February 21, 2018
హైదరాబాద్: దేశ తొలి మహిళా ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ పైలట్‌గా అవని చతుర్వేది నిలిచి రికార్డు నెలకొల్పింది. జామ్‌నగర్ ఎయిర్‌బేస్ నుంచి సోమవారం నాడు ఒంటరిగా 30 నిమిషాల పాటు మిగ్-21 సూపర్ సోనిక్ యుద్ధ విమానాన్ని నడిపి చరిత్ర సృష్టించింది. అత్యుత్తమ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ పైలెట్‌గా ఎగరాలనుకుంటున్నా. ఈ క్రమంలో ప్రతీరోజు నేర్చుకుంటూనే ఉంటానని అవని పేర్కొంది. అవని స్వస్థలం మధ్యప్రదేశ్‌లోని దియోలాండ్ అనే చిన్న పట్టణం. ఎయిర్‌చీఫ్ మార్షల్ బీ ఎస్ ధనోవ్ స్పందిస్తూ.. అవనీకి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. మహిళా అధికారులను ప్రోత్సహించడంలో ఐఏఎఫ్ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. ప్రస్తుత ఫైటర్ పైలట్ల శిక్షణ బ్యాచ్‌లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ మొత్తం ముగ్గురు మహిళలకు అవకాశం కల్పించింది. వీరిలో అవని చతుర్వేది ఒకరు.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్‌కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్‌లో భారత పాస్‌పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్‌లో భారత రాయబారి విపుల్‌కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







