610 కిలోల బరువు నుంచి 68 కిలోలకు తగ్గిన పాతికేళ్ల సౌదీ యువకుడు
- February 24, 2018
రియాద్ : రాజు తలచుకొంటే ...దెబ్బలకు కొదువా అని మనకు ఓ సామెత ఉంది...అదే రాజు జాలి పడితే కొండబాబు కొవ్వు కరిగి మామూలు యువకుడిగా మారిపోతాడు. ఆ యువకుడు ఇదివరకు తన వళ్ళు తానె మోసుకోలేకపోయేవాడు. సౌదీ అరబ్‌కు చెందిన ఖాలిద్ అల్ షెరీ ప్రపంచంలోనే అత్యంత భారీ స్థూలకాయునిగా ప్రసిద్ధి చెందాడు తన 610 కిలోల భారీ ఆకారంను గడచిన 4 ఏళ్లలో 68 కిలోల బరువుకు తగ్గించుకుని అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు. 2013లో ఖాలిద్ భారీ ఆకారంతో నానా యత్నాలు చెందేవాడు. ఆనాటి సౌదీ మాజీ రాజు ఆ యువ్క్ర్కునికి వైద్యానికి అయ్యే ఖర్చు భరిస్తానని పేర్కోవడమే కాక అందుకు అన్నిఏర్పాట్లు చేశారు. ఆ కాలంలో ఖాలిద్ కనీసం నిలబడలేని స్థితిలో ఉన్నాడు. ఖాలిద్‌ను ఆసుపత్రికి తరలించేందుకు అమెరికా నుంచి ప్రత్యేక క్రేన్ తీసుకువచ్చారు. రియాద్‌లోని ఆసుపత్రిలో ఖాలిద్‌కు 30 మంది వైద్య సిబ్బంది సేవలు అందించారు. దీంతో ఆరు నెలల్లోనే 320 కిలోల బరువు తగ్గాడు. నాలుగు సంవత్సరాల పాటు చికిత్స అందుకున్న ఖాలిద్ ఇప్పుడు 80శాతం బరువు తగ్గాడు. ప్రస్తుతం ఖాలిద్ బరువు 68 కిలోలతో చురుగ్గా తిరుగుతున్నాడు.
తాజా వార్తలు
- ఇరాక్ పై అమెరికా, సౌదీ వైమానిక దాడులు...
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు
- భారత్ పై 100% టారిఫ్స్ బిల్లుకు అమెరికా ఆమోదం
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తుల విక్రయంపై కొరడా..!!
- ఖతార్‌లో నకిలీ మెడికల్ సర్టిఫికెట్లపై దర్యాప్తు ప్రారంభం..!!
- దుబాయ్‌లో రాస్ అల్ ఖోర్, అల్ ఖైల్ రోడ్లపై కొత్త లేన్లు..!!
- వాహనదారులకు జనరల్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- హోర్ముజ్ భద్రతపై జీసీసీ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- విదేశాల నుంచి స్వీట్లు తీసుకెళ్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!







