జాతీయ దినోత్సవ సందర్భంగా MoI ట్రాఫిక్ ఉల్లంఘనలను తగ్గిస్తుందనే పుకార్లు నమ్మవద్దు
- February 24, 2018
కువైట్ : శుక్రవారం దేశీయ జాతీయ దినోత్సవ సందర్భంగా పౌరులు, నివాసితులపై ట్రాఫిక్ ఉల్లంఘనల పట్ల ఉదారంగా వ్యవహరించి కేసులు పెద్దగా ఉండవని కొన్ని సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న అసత్యపు పోస్టులను ఇంటీరియర్ మంత్రిత్వశాఖ శుక్రవారం తిరస్కరించింది. ఈ అంశంపై పోస్ట్ చేసినవన్నీ నకిలీ వార్హలని మంత్రిత్వ శాఖ పబ్లిక్ రిలేషన్స్ అండ్ సెక్యూరిటీ మీడియా డిపార్ట్మెంట్ ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది. మంత్రిత్వ శాఖ యొక్క అధికారిక సంస్థల నకిలీ పోస్టులు మరియు సమాచారాన్ని పోస్ట్ చేసిన వారికి వ్యతిరేకంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాయని ధృవీకరించింది. విశ్వసనీయమైనవిగా పేర్కొన్న వార్తల మూలాలని నిర్ధారించుకోండని మంత్రిత్వశాఖ వివిధ మీడియా సంస్థలకు విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు
- భారత్ పై 100% టారిఫ్స్ బిల్లుకు అమెరికా ఆమోదం
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తుల విక్రయంపై కొరడా..!!
- ఖతార్‌లో నకిలీ మెడికల్ సర్టిఫికెట్లపై దర్యాప్తు ప్రారంభం..!!
- దుబాయ్‌లో రాస్ అల్ ఖోర్, అల్ ఖైల్ రోడ్లపై కొత్త లేన్లు..!!
- వాహనదారులకు జనరల్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- హోర్ముజ్ భద్రతపై జీసీసీ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- విదేశాల నుంచి స్వీట్లు తీసుకెళ్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్‌తో భేటీ అయిన నెతన్యాహు..







