శ్రీదేవి మరణం వెనుక.. పై సోషల్ మీడియాలో రకరకాలు వార్తలు హాల్ చల్
- February 25, 2018
వెండితెర అతిలోక సుందరి శ్రీదేవి మరణం సిని ప్రపంచాన్ని కలచివేస్తోంది. బాల్యంలోనే వెండితెరకు పరిచయమై గొప్పనటిగా ఎందరో అగ్రకథానాయుకుల సరసన హిట్ పేర్ గా నటించి కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న నటి శ్రీదేవి భారతీయ సినీలోకానికి తీవ్రవిషాదాన్ని మిగిల్చి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఇక చివరిగా 2017లో మామ్ చిత్రంలో నటించిన శ్రీదేవి మంచి విజయాన్ని అందుకున్నారు. తన కెరీర్లో 15 ఫిల్మ్‌ఫేర్ అవార్డులను అందుకున్నారు. బాలీవుడ్లో తెరంగేట్రం తర్వాత 1996లో బోనీ కపూర్‌ను వివాహం చేసుకున్నారు. శ్రీదేవి-బోనికపూర్ దంపతులకు జాన్వీ, ఖుషిలు ఉన్నారు. పెద్దమ్మాయి జాహ్నవి తొలి చిత్రం చిత్రీకరణ దశలో ఉండగా ఇలా జరగడం చాలా బాధాకరం.
ఇక అసలు మ్యాటర్ ఏంటంటే.. శ్రీదేవి మరణం వెనుక కారణాల పై సోషల్ మీడియాలో రకరకాలు వార్తలు హాల్ చల్ చేస్తున్నాయి. ఇక అసలు విషయంలోకి వెలితే.. శ్రీదేవి ఆకస్మిక మరణం వెనుక అనేక అనుమానాలు వెంటాడుతున్నాయి.. ఉన్నట్టుండి గుండెపోటుతో హఠాన్మరణం చెందడానికి ఊహించగలిగే కారణాలేవైనా ఉన్నాయా.. 54 ఏళ్ల వయసులోనే శ్రీదేవి నిజంగానే గుండెపొటుతొ చనిపొయిందా..అంటే అనుమానమే.శ్రీదేవి ఈ మధ్యకాలంలొ కూతురిని ప్రమోట్ చేస్తూ.. బిజీ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే తెలీకుండానే ఒత్తిడికి గురైందా.. అంటే వందశాతం నిజం అంటున్నారు సినీ జనాలు. ఇటీవల ఒక ఫ్యాషన్ ఈవెంట్లో జాహ్నవి కొద్దిగా ఎక్స్ట్రా చేస్తే..అందరి ముందే కసురుకున్న ఇన్సిడెంట్ ఒకటి తాజాగా సోషల్ మీడియాలో ట్రాల్ అవుతోంది.
ఒక కూతురికి తల్లిగా.. తన కూతురి ఇంటి నుండి బయటకి వెళ్లాక తిరిగి ఇంటికి వచ్చేవరకు తనలో ఏదో తెలియని గాబరాగా ఉంటుందని గతంలో శ్రీదేవి చెప్పిన విషయం తెలిసిందే. ఒంటి పై పాతికేళ్లు కూడా రాకుండానే జాహ్నవి వెలగబెడుతున్న రాచ కార్యాలు కూడా శ్రీదేవికి ఆందోళన కల్గించాయని సన్నిహితులు చెబుతుంటారు. గత నెలలోనే పెదవులకు చేయించుకున్న ప్లాస్టిక్ సర్జరీ కూడా వికటించిన సంగతి తెలిసిందే. ఇదీ ఆమె ఆరోగ్యంపై తెలీకుండా ప్రభావం చూపించిందని తెలుస్తోంది. ఇక వాటన్నిటికీ తోడు భర్త బొనీకపూర్ మొదటి భార్య కొడుకుతో శ్రీదేవికి మంచి రిలేషన్ లేదు. అసలు తనని ఒక మనిషిగా కూడా గుర్తించనని అర్జున్ కపూర్ గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇప్పుడు అర్జున్‌ని వదిలేసి కూతురు జాహ్నవిని తండ్రి బొనీకపూర్ ఎక్కువగా ప్రమోట్ చేయడం పై కూడా.. ఇటీవల కుటుంబంలో ఎక్కువగా గొడవలు జరుగుతున్నాయట. దీంతో ఈ విషయం పై కూడా శ్రీదేవి మానసికంగా బాగా టార్చర్ అనుభవిస్తోందని సమాచారం. ఇప్పుడు దుబాయ్ పెళ్లి ఈవెంట్లో హఠాత్తుగా గుండెపొటు రావడానికి కూడా ఇవే కారణాలంటున్నారు బీటౌన్ వర్గాలు. గతంలొ ఎప్పుడూ కూడా శ్రీదేవికి ఈ రకమైన జబ్బు పడ్డ దాఖలాలు లేవు. అలాంటిది ఒక్కసారిగా సడన్‌గా గుండెపోటుతో చనిపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. మరి శ్రీదేవి హాఠాన్మరణం వెనుక ఉన్న నిజాలు భర్త బోనీ కపూర్ చెబుతాడో లేదో చూడాలి.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి