అప్పుడు మోనా షౌరీ కుమారుడు -ఇప్పుడు శ్రీదేవి కూతురు
- February 25, 2018
అప్పుడు మొదటి భార్య.. ఇప్పుడు శ్రీదేవి!
ముంబయి: శ్రీదేవి కన్నా ముందు బోనీ కపూర్‌కు మోనా షౌరీతో వివాహం జరిగింది. ఆ తరువాత కొన్ని కారణాల వల్ల వారిద్దరూ విడిపోయారు. అనంతరం బోనికపూర్ శ్రీదేవిని పెళ్లి చేసుకోవడం జరిగిపోయాయి. భర్త లేరనే బాధతో మోనా అనారోగ్యంతో చనిపోయారు. అప్పటికే ఆమె కుమారుడు అర్జున్ కపూర్ 'ఇషక్ జాదే' చిత్రంలో నటిస్తున్నారు. అర్జున్ నటించిన మొదటి సినిమా ఇది. అయితే..ఈ చిత్రం 2012 మేలో విడుదల కావాల్సి ఉండగా, అర్జు్‌న్ తల్లి మార్చిలో మరణించారు. దాంతో ఆమె తన కుమారుడు నటించిన మొదటి సినిమా చూడలేకపోయారు.
ఇప్పుడు శ్రీదేవి విషయంలోనూ ఇదే జరిగింది. శ్రీదేవి మొదటి కుమార్తె జాన్వి కపూర్ ప్రస్తుతం 'ధడక్' చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా జూన్‌లో విడుదల కావాల్సి ఉంది. శ్రీదేవి సలహాతోనే జాన్వి ఈ సినిమాకు ఒప్పుకొన్నారు. అమ్మ ఉంటేనే ధైర్యంగా షూటింగ్ చేస్తాననేవారు. దాంతో ఉదయం నుంచి శ్రీదేవి జాన్వి కోసం సెట్‌లోనే ఉండేవారు. ఈ సినిమాలని ఫస్ట్‌లుక్ విడుదలైనప్పుడు జాన్వి..అచ్చం తన తల్లిలాగే ఉన్నారంటూ అభిమానులు మురిసిపోయారు. తొలి సినిమాతో జాన్వికి మంచి గుర్తింపు వస్తుందని ఎన్నోసార్లు చెప్పిన శ్రీదేవి తన కూతురిని తెరపై చూసుకోకుండానే వెళ్లిపోవడం బాధాకరం.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి