యు.ఎ.ఈ. : నిబంధనలు పాటించండి - జాతీయ దినోత్సవ సంబరాలు జరుపుకొండి

- November 27, 2015 , by Maagulf
యు.ఎ.ఈ.  : నిబంధనలు పాటించండి - జాతీయ దినోత్సవ సంబరాలు జరుపుకొండి

44 వ యు.ఎ.ఈ జాతీయ దినోత్సవం మరియు అమరవీరుల దినోత్సవాన్ని విజయవంతం చేయడానికి దుబాయి పొలిసు వారు సమగ్ర ప్రణాళిక అమలుజరుపనున్నారు. ఈ ప్రణాళికలో భాగంగా నగరమంతటా, ముఖ్యంగా భారీ కార్యక్రమాలు జరిగే చోట, ప్రదర్శనలు నిర్వహించే ప్రదేశాల్లో గస్తీని ముమ్మరం చేసారు. బూర్ దుబాయి అంతటా 110 పొలిసు గస్తీ దళాలు, 25 ట్రాఫిక్ గస్తీ దళాలతో సహా మొత్తం 176 దళాలను మోహరించగా, దేయిరాలో 66 పొలిసు గస్తీ దళాలు,   11ట్రాఫిక్ గస్తీ దళాలను మొహరిస్తామని, అన్ని రోడ్లపై రాడార్లను ఏర్పాటుచేస్తామని దుబాయి పొలిసు శాఖ జనరాల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాఫిక్ డైరక్టర్ కల్నల్ సైఫ్ ముహైర్ అల్ మజ్రోయి  తెలుపుతూ, సంతోషం, సంబరం అనేది ట్రాఫిక్ ను అడ్డగించి, నిబంధనలను అతిక్రమించడం కాదని;  ప్రజలందరూ కలసి మెలసి సౌభ్రాత్రుత్వంతో జరుపుకోవాలని ఆయన విజ్ఞప్తి చేసారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com