అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం RX 100
- March 01, 2018ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం RX 100
( An Incredible Love Story ) . కార్తికేయ, పాయల్ రాజపుట్ ఇందులో హీరోహీరోయిన్లు. KCW బ్యానర్ పై అశోక్ రెడ్డి గుమ్మకొండ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రీలుక్‌ను ఆదివారం విడుదల చేశారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. రావురమేష్, సింధూర పువ్వు రాంకీ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. హైలీ ఎమోషనల్ రియలిస్టిక్ లవ్ స్టొరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక బృందం పని చేస్తోంది . నేషనల్ అవార్డు విన్నర్ ప్రవీణ్. కే.ఎల్ ( 'కబాలి' ఫేమ్ ) ఈ చిత్రానికి ఎడిటర్ గా పనిచేస్తున్నారు. తెలుగులో ఆయనకు యిదే తొలి చిత్రం కావడం విశేషం . వేసవిలో సినిమాను విడుదల చేస్తామని దర్శకనిర్మాతలు చెబుతున్నారు.
నటీనటులు:
కార్తికేయ, పాయల్ రాజపుట్, రావు రమేష్, రాంకీ ( సింధూర పువ్వు ఫేమ్ ), సత్య, గిరిధర్, లక్ష్మణ్.
సాంకేతిక వర్గం:
మ్యూజిక్: చైతన్ భరద్వాజ్ ,లిరిక్స్: శ్రీమణి , చైతన్య ప్రసాద్,సిరాశ్రీ, కొరియోగ్రఫీ:స్వర్ణ, అజయ్,సురేష్ వర్మ, స్టంట్స్: రియల్ సతీష్ , ఆర్ట్ డైరెక్టర్: రఘు కులకర్ణి, ఎడిటర్: ప్రవీణ్. కే .ఎల్ ( కబాలి ఫేమ్ ), సినిమాటోగ్రఫీ: రామ్ ,పబ్లిసిటీ డిజైనర్: ఈశ్వర్ అందే, ఎగ్జిక్యూటివ్: సూర్య నారాయణ, నిర్మాత: అశోక్ రెడ్డి గుమ్మకొండ , రచన-దర్శకత్వం: అజయ్ భూపతి.
తాజా వార్తలు
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్‌తో భేటీ అయిన నెతన్యాహు..
- బిగ్ టికెట్ మూడో వారపు ఈ-డ్రాలో నలుగురికి Dh 25 వేల చొప్పున నగదు బహుమతి
- ఎమిరేట్స్‌లో ఇక క్రిప్టో చెల్లింపులు..Crypto.com Pay ద్వారా విమాన టికెట్ల బుకింగ్‌కు అవకాశం
- కార్మికుల కోసం 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం ఆరో వారం..
- తెలంగాణకు 11.56 లక్షల పీఎంఏవై-జీ ఇళ్ల కేటాయింపు కోరిన సీఎం రేవంత్
- కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ అర్వింద్ ధర్మపురి..
- మలబార్ గోల్డ్ & డైమండ్స్ బ్రాండ్ అంబాసడర్‌గా ఎంఎస్ ధోనీ
- భారత బొమ్మల పరిశ్రమకు కేంద్రం భారీ ప్రోత్సాహం: ఎంపీ బాలశౌరి
- జీఎంఆర్ ఏరో టెక్నిక్–హనీవెల్ ఏరోస్పేస్ వ్యూహాత్మక ఒప్పందం
- యూరప్‌కు ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా జయ్ కుమార్ గుంటుపల్లి...







