ఇకపై సైన్యంలో సౌదీ అరేబియా మహిళలు

- March 01, 2018 , by Maagulf
ఇకపై సైన్యంలో సౌదీ అరేబియా మహిళలు

రియాద్‌: ' ఆకాశంలోనే కాదు...ఆర్మ్ లోనూ సగమే ' కానున్నారు సౌదీ మహిళలు. ఇకపై మహిళలు కూడా సైన్యంలో చేరవచ్చంటూ సౌదీ అరేబియా చారిత్రక ప్రకటన చేసింది. తమ దేశంలో మహిళా సాధికారతను పెంపొందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.రియాద్‌, మక్కా, అల్‌-ఖాసిం, మదీనా తదితర ప్రాంతాల నుంచి సైన్యంలో చేరేందుకు దరఖాస్తు చేసుకోవాలని.. అందుకు గురువారం(మార్చి 1వ తేదీ) ఆఖరు రోజని ప్రకటించింది. ఆర్మీలో చేరాలనుకునే మహిళలు దరఖాస్తులో 12 అంశాలను తప్పకుండా పూర్తి చేయాలనీ సూచించింది. మహిళలు సౌదీ జాతీయురాలై ఉండటం.. 25-35 ఏళ్ల మధ్య వయస్సు వారై ఉండాలి. కనీసం హైస్కూలు విద్యార్హత కలిగి ఉండాలి. వైద్య పరీక్షలు తప్పనిసరని పేర్కొంది. ఇక శారీరక ధారుఢ్యం విషయంలో అభ్యర్థి వయసు 155 సెంటీమీటర్ల ఎత్తుకు  తగ్గకూడదని తెలిపింది. వీటితోపాటు ఇతరత్రా నిబంధనలను విధించింది. అయితే సంరక్షకులు (గార్డియన్‌) అనుమతితోనే ఆమె సైన్యంలో చేరాలన్న నిబంధన అత్యధిక మహిళలకు రుచించడం లేదు. ఈ నియామకం యుద్ధంలో పోరాటడం కోసం కాదని.. సైన్యంలో రాణించగలమన్న భావన మహిళలలో పెంపొందించేందుకేననని అధికారులు చెబుతున్నారు. చమురుపై ఆధారపడుతున్న సౌదీ భవిష్యత్తులో దాని నుంచి దూరంగా జరగాలనే ఉద్దేశంతో విజన్ 2030 కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ క్రమంలో సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్.. మహిళల అభ్యున్నతికి ఆటంకాలుగా ఉన్న చట్టాలకు సవరణలు చేస్తూ వారికి సడలింపులు ఇస్తున్నారు. మహిళలు డ్రైవింగ్‌ చేయటంపై నిషేధం ఎత్తివేత, స్టేడియం లో ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లు అనుమతులు మంజూరు ఆ బావనలోనే అనుమతించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com