రెండు తలల పాము
- November 28, 2015

రింగ్ రింగ్ .. హలో లక్ష్మీ బాగున్నావా ,పిల్లలు బాగున్నారా
బడికి బాగా వెళుతున్నారా.. ఏంటి అప్పుడే పడుకున్నారా .. ?
హలో హలో నేను బాగానే ఉన్నానండి కానీ,పిల్లల స్కూల్
ఫీజు కట్టలేదని టీచర్ రోజు అడుగుతున్నారండి ఇంకా
ఇంట్లో వంట చేసుకోడానికి కూడా డబ్బులు లేవండి !
సరే సరే నేను నా విషయం చెప్పానుగా ఇక్కడ మా సేటు
సాలరీ సరిగా ఇవ్వటం లేదు క్రితం సారి బదులు తీసుకున్న
డబ్బులే తిరిగివ్వలేదు మళ్లీ ఎవరినన్నా అడిగి పంపుతాలే
అలా ఎందుకండీ అన్ని బాధలతో అక్కడ ఉంటారు రమ్మంటే
రారు,ఇక్కడ కూలి నాలి చేసుకున్నా కడుపునిండా బువ్వ
దొరుకుతుంది కలిసి బ్రతుకొచ్చు,చిన్న పిల్ల కడుపుల ఉండగా వెళ్లి
ఇప్పుడు పెద్దది పెద్ద మనిషి అయి అయిదేండ్లాయే,చిన్నది
హైస్కూల్ సదువ్వట్టే నీ జాడ నేమో యాడ కాన రాకపాయే,
నేను బీడిలు చేసుకుంటానో కూలీ జేసుకుంటానో పిల్లల్ని పెంచితి
నువ్వే యాడాదికో రెండేండ్లకొక్కసారి పంపేటియి నీ వడ్డీ లకే పోయే
అన్ని ఉన్న అయ్యలకే గఘనమాయే ఈ పెళ్ళిళ్ళు ,నేనెట్లా చెయ్యాలే
సరిగా కాల్ కూడా చేస్తలేవయ్యే , గొంత పెద్ద మనసు చేసుకొని రాయ్యా ..
ఈ సంక్రాంతి కన్నా ..
అయ్యో మళ్లీ మొదలెట్టినవ రామాయణం, మా సారు రానిస్తే
నేను రానా ఏంటి,,,నేను బతికేది మీ కోసం కాదా ఏంటి ?
మళ్లీ కాల్ చేస్తా ఫోనులో డబ్బుల్లేవ్ బై బై .. కట్ కట్ కట్
రింగ్ రింగ్ హలో ప్రియా రూములో ఉన్నావా?
ఏంటి నువ్ కాల్ చేస్తే నా ఫోన్ బిజీ ఉందా
ఆ ఎవరో పిచ్చాళ్ళు రాంగ్ కాల్ లే కానీ .. సరే సరే.. నేను
సూపర్ మార్కెట్లో కర్రీ కోసం చికెన్ కొట్టించాను.. చేపలు
కడిగిస్తున్నాను అవేమో ఫ్రై కోసం.. త్వరగా మసాలాలు రెడీ చెసుకో
ఇద్దరు హీరోయిన్ల తో ఏదో"తెలుగు సినిమా" ఈ రోజు ఇక్కడ దుబాయ్ లో
విడుదల అవుతుందంట వంట అవుతే, త్వరగా తినేసి వెళదాం... బై
అట్నుంచటే జుమేరా పార్క్ బీచ్ లో వెన్నెల్లో గడిపోద్దాం ... లా లలలా
(కొన్ని బంధాలు స్వంతింట్లో అక్కడ బిక్కు బిక్కు మంటూ, కొన్ని భాద్యత రాహిత్యమైన సహజీవనాలు ఇంకెక్కడో )
--జయ రెడ్డి బోడ(అబుధాబి)
తాజా వార్తలు
- IPL 2026: ముంబై పై పంజాబ్ ఘన విజయం
- దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీపంలో తొలి ఎయిర్ ట్యాక్సీ స్టేషన్ పూర్తి: షేక్ హందాన్ సమీక్ష
- మైక్రో ఫైనాన్స్ కేసులో బిగ్ ట్విస్ట్: రమావత్ మధు అరెస్ట్!
- ఇజ్రాయెల్–లెబనాన్ మధ్య 10 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం: ట్రంప్ ప్రకటన
- అమెరికా–ఇరాన్ రెండో దఫా చర్చలు
- ఎయిర్ న్యూజిలాండ్ వినూత్న నిర్ణయం
- గ్రేటర్ హైదరాబాద్లో సీట్ల జాతర
- పార్లమెంటులో కీలక బిల్లుల సందడి..
- డీలిమిటేషన్ పై ప్రధాని మోదీ భరోసా...
- ఢిల్లీ ఎయిర్పోర్ట్లో హైటెన్షన్..2 విమానాలు ఢీ!









