బరువు పెరగడానికి కారణమయ్యే ఫుడ్స్?

- November 28, 2015 , by Maagulf
బరువు పెరగడానికి కారణమయ్యే ఫుడ్స్?

ఆరోగ్యకమైన ఆహారం తీసుకోవడం చాలా సాధారణం. కానీ.. వాటి గురించి పూర్తీగా తెలుసుకోకుండా.. తినేస్తూ ఉంటారు చాలామంది. కానీ అవి మీ బరువు పెంచుతాయని ఖచ్చితంగా తెలుసుకోవాలి. అనేక రకాల హెల్తీ ఫుడ్స్ లో క్యాలరీలు ఎక్కువగా ఉంటారు. అయితే హెల్తీ ఫుడ్స్ తీసుకోవాలి కానీ.. తగిన మోతాదులో తీసుకుంటే ఎలాంటి ప్రమాదం ఉండదు.10 రోజుల్లో బొజ్జను కరిగించే ఉత్తమ చిట్కాలు మన శరీరానికి సహజమైన, ఆరోగ్యకరమైన ఆహారం అందాలి. సరైన పోషకాలు అందించాలి. ఒకవేళ బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నా.. హెల్తీ ఫుడ్స్ తీసుకుంటేనే మంచిది. అయితే ఏ రకమైన హెల్తీ ఫుడ్స్ లో ఎక్కువ క్యాలరీలు ఉండి, బరువు పెరగడానికి కారణమవుతాయో తెలుసుకుని తక్కువగా తీసుకుంటే మంచిది. అంతేకాదు కొన్ని ఆహారాలు చూడ్డానికి ఆరోగ్యకరమైనవే అయినా.. హెల్తీ కానివి ఉంటాయి. అలాంటి వాటికి దూరంగా ఉండటం చాలా మంచిది. అలాంటి ఆహారాలేంటో ఇప్పుడే చూసేయండి..ప్రస్తుతం బ్రౌన్ రైస్ వాడటం ట్రెండ్ గా మారింది. చాలా మంది తెల్ల బియ్యంకు బదులుగా బ్రౌన్ రైస్ నే తీసుకుంటున్నారు. ఎందుకంటే బ్రౌన్ రైస్ లో ఫైబర్, ఎక్కువ పోషకాలు ఉంటాయని. అయితే బ్రౌన్ రైస్ వల్ల మీ బరువు పెరుగుతుంది. ఎందుకంటే ఒక కప్పు బ్రౌన్ రైస్ లో 35గ్రాముల ఫ్యాట్ ఉంటుంది. సాఫ్ట్ డ్రింక్స్ పై రాసిన డైట్ అనే పదాన్ని అసలు నమ్మకండి. ఎందుకంటే ఇవి డైట్ కాదు ఫ్యాట్ ని పెంచుతాయి. షుగర్ ఫ్రీ, జీరో క్యాలరీ అని చెప్పే వీటిలో ఆస్పార్టమే అనేది ఉంటుంది. ఇది బరువు పెరగడానికి కారణమవుతుంది. యోగర్ట్ లో మంచి బ్యాక్టీరియా, క్యాల్షియం ఉంటుంది కాబట్టి ఇది ఆరోగ్యానికి మంచిది. కాబట్టి రోజుకి ఒక కప్పు యోగర్ట్ తీసుకోవడం చాలా మంచిది. వీటిలో ఫ్యాట్, క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఫ్లేవర్స్ ఉండే యోగర్స్ తీసుకుంటే వాటిలో మరింత ఎక్కువ క్యాలరీలు, షుగర్ ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునే వాళ్లు ఫ్లేవర్ యోగర్ట్ తీసుకోకపోవడం మంచిది. అవకాడోలో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్స్ ఎక్కువగా ఉంటాయని తెలుసు. అయితే మీకు తెలుసా.. ఇది మీ బరువు పెరగడానికి కారణమవుతుందని. ఎందుకంటే వీటిలో ఎక్కువ మోతాదులో ఫ్యాట్, క్యాలరీలు ఉంటాయి. ఒక అవకాడోలో 350 క్యాలరీలుంటాయి. నట్స్ అంటే చాలా ఆరోగ్యకరమైనవని అందరికీ తెలుసు. వీటిలో ప్రొటీన్స్, ఫైబర్, విటమిన్స్, మినరల్స్, ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. అయితే మరోవిషయం ఏంటంటే క్యాలరీలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి వీటిని కూడా తగిన మోతాదులో తీసుకోవడం మంచిది. ఫ్రూట్ జ్యూస్ లను ఇంట్లో చేసుకుని తాగితే మంచిదే. కానీ బయట కొని తాగితే మాత్రం అనారోగ్యమే. ప్యాక్ చేసిన ఫ్రూట్ జ్యూస్ లలో చక్కెర ఎక్కువగా ఉంటుంది. కెమికల్ ప్రిజర్వేటివ్స్, ఫ్లేవర్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి బరువు పెరగడానికి కారణమవుతాయి. లేదంటే అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. డ్రైడ్ ఫ్రూట్స్ అంటే కర్జూరాలు, ఆప్రికాట్స్, ఫిగ్స్, ఎండు ద్రాక్ష, ప్రూన్స్. వీటిల్లో నీటి శాతం కంటే చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. వీటిలో ఫైబర్స్, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. దాంతో పాటు క్యాలరీలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. తాజా పళ్ల కంటే వీటిలో 8 రెట్లు ఎక్కువ క్యాలరీలు, చక్కెరను కలిగి ఉంటాయి. ఒక కప్పు ఈ ఎండు ద్రాక్ష లో 460 క్యాలరీలుంటాయి. అదే తాజా ద్రాక్షలో 60 క్యాలరీలుంటాయి. బ్రాన్ ఆరోగ్యానికి మంచిదే కానీ.. అరటిపండు, యాపిల్ వంటి మఫిన్స్ మార్కెట్ లో చాలా దొరుకుతాయి. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు షుగర్ కంటెంట్, వెన్న చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక బ్రాన్ మఫిన్ లో 420 క్యాలరీలుంటాయి. రెడీమేడ్ సలాడ్స్ తీసుకునేటప్పుడు చాలా ఆరోగ్యకరమైనవని భావిస్తాం. సలాడ్స్ చాలా ఆరోగ్యకరమైనవే కానీ.. రెడీమేడ్ సలాడ్స్ లో సాస్ కలిపుతారు కాబట్టి అవి ఆరోగ్యానికి మంచివి కావు. వీటిల్లో ఫ్యాట్స్, క్యాలరీలు బరువు పెరగడానికి కారణమవుతాయి. కాబట్టి ప్లెయిన్ సలాడ్స్ ని తీసుకోవాలి.. అవి కూడా పరిమితికి మించి తీసుకోకూడదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com