మరో అరుదైన ఘనత సాధించిన ఢిల్లీ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్
- March 07, 2018
ఢిల్లీలోని GMR అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ మరో అరుదైన ఘనత సాధించింది. 2017 సంవత్సరానికి గానూ ప్రపంచంలో అత్యుత్తమ ఎయిర్పోర్ట్ గా ఎంపికైంది. అత్యున్నతమైన ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ అవార్డ్ కైవసం చేసుకుంది. 60 మిలియన్లకు పైగా ప్రయాణికుల సామర్థ్యం విభాగంలో... GMR ఎయిర్పోర్టు ఈ అవార్డు దక్కించుకుంది. దీనిపై GMR యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. IGIA భాగస్వాములు, ఉద్యోగులు చూపిన పట్టుదల, ఆత్మవిశ్వాసం, నిబద్ధత వల్లనే ఈ ఘనత సాధ్యమైందని... ఢిల్లీ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ CEO ప్రభాకర్ రావు తెలిపారు. తమకు ఎంతగానో సహకరించిన కేంద్ర విభాగాలన్నింటికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. 2016లో 40 మిలియన్ల విభాగంలో ఢిల్లీ ఎయిర్పోర్ట్... ASQ అవార్డుల్లో ద్వితీయ స్థానంలో నిలిచింది. గతంలో 2014, 2015 సంవత్సరాల్లో 25 నుంచి 40 మిలియన్ సామర్థ్యం విభాగాల్లోనూ ఈ ఎయిర్పోర్టు నెంబర్ వన్ స్థానం దక్కించుకుంది.
తాజా వార్తలు
- దుబాయ్లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా







