సిరియాలో తక్షణమే కాల్పుల విరమణను అమలు చేయాలని ఐక్యరాజ్య సమితి డిమాండ్..
- March 08, 2018
ఐక్యరాజ్య సమితి : సిరియాలో తక్షణమే కాల్పుల విరమణను అమలు చేయాలని ఐక్యరాజ్య సమితి డిమాండ్ చేస్తోంది. ఐక్యరాజ్య సమితి చేసిన తీర్మానం 2401ని అమలు చేయాలని పిలుపిచ్చింది. సిరియాలో నెలకొన్న దుర్బర పరిస్థితుల పట్ల భద్రతా మండలి సభ్యులు ఆందోళన వెలిబుచ్చారు. అక్కడ ఘర్షణల విరమణపై చర్చ జరగాలని కోరారు. జనాంతిక చర్చల అనంతరం భద్రతా మండలి అధ్యక్షుడు, ఐరాసలో డచ్ రాయబారి కరేల్ వన్ ఊస్టరామ్ మాట్లాడుతూ పై డిమాండ్ చేశారు. అంతకుమించి సమావేశం వివరాలు వెల్లడించలేదు. ఫిబ్రవరి 24న ఏకగ్రీవంగా ఆమోదించిన 2401 తీర్మానాన్ని అమలు చేయడంలో జరిగిన వైఫల్యాన్ని చర్చించేందుకు తక్షణమే సమావేశం జరగాలని ఫ్రాన్స్, బ్రిటన్లు కోరాయి.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







