అమెరికా లో భారీ మంచు తుఫాన్...

- March 08, 2018 , by Maagulf
అమెరికా లో భారీ మంచు తుఫాన్...

అమెరికాలోని న్యూయార్క్, న్యూజెర్సీ ప్రాంతాలను మంచుతుఫాన్ వణికిస్తోంది. గత కొద్దిరోజులుగా కురుస్తున్నమంచుకారణంగా ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.  ఎక్కడ చూసినా పేరుకుపోయిన మంచే కనిపిస్తోంది. గత కొద్దిరోజులుగా జనం ఇళ్లకే పరిమితయ్యారు. న్యూయార్క్ లో 10 అంగులాల మేర మంచుపేరుకుపోగా.. న్యూజెర్సీ, కనెక్ట్ కట్ లో రికార్డు స్థాయిలో 20 అంగులాల మేర మంచు పడిందని అధికారులు వెల్లడించారు. తీవ్రంగా కురుస్తున్నమంచుకారణంగా రవాణా వ్యవస్థ స్థంభించిపోయింది. ఇక న్యూయార్క్, న్యూజెర్సీ ఎయిర్ పోర్టుల్లో  వేలాది విమానాలు రద్దయ్యాయి. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు. బలంగా వీస్తున్న గాలుల కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రంగంలోకి దిగిన అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com