దుబాయ్ ని అలరించిన 'MID' వారి "మేరి ఆవాజ్ సునో"

- November 29, 2015 , by Maagulf

మ్యూజిక్ ఇండియా అట్ దుబాయ్ అనే  సంస్థ 2010 సంవత్సరం లో శ్రీమతి ప్రశాంతి చోప్రా గారిచే స్థాపించ బడినది. మన భారతీయ సంప్రదాయ శాస్త్రీయ సంగీతాన్ని UAE లో పదిమందికి పంచిపెట్టటంతో బాటు, ఔత్సాహిక గాయనీ, గాయకులకు అవకాసం కల్పించడం సంస్థ ముఖ్యోద్దేశం. 
స్థాపించిన నాటి నుండి కూడా ఈ సంస్థ అత్యున్నత ఆశయాలతో, వినూత్న, వినోద కార్యక్రమాలతో సంగీతాభిమానులను అలరిస్తూనే ఉంది.

అందులో భాగంగా ఈ నెల 27 వ తేది శుక్రవారం సాయంత్రం 6:30. గంటలకు అల్ ముల్లా ప్లాజా,దుబాయ్ లో మొదలైన "మేరి ఆవాజ్ సునో" అనే టాలెంట్ షో ఆద్యంతం ఆహుతులను ఆనంద డోలికల్లో తేలియాడించింది. ఈ కార్యక్రమము లో పాల్గునేందుకు UAE నలుమూలల నుండి కళాకారుల నుండి అనూహ్య స్పందన లభించడం ఒక విశేషం. ఎన్నుకోబడిన గాయని గాయకులలో ముందుగా ఈ ఎపిసోడ్ లో కుమారి సుచేత, కుమారి ప్రణతి, శ్రీమతి విద్య, అభిషేక్, పద్మ కుమార్ లు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో తమ ప్రతిభాపాటవాలని ప్రదర్శించారు. వీరితో పాటు MID టీం సభ్యులు తమ గానం తో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు.

          సంస్థ స్థాపించిన నాటినుండి ప్రశాంతి చోప్రా గారికి అన్నివిధాల సహాయ సహకారాలను అందించడం లో శ్రీ రాకేష్ మరింగంటి గారు మరియు కింతలి భాగ్యలక్ష్మి గారు సంస్థ సభ్యులుగా వ్యవహరిస్తున్నారు.


MID,దుబాయ్ కార్యక్రమాలలో పాల్గొనడానికి [email protected]ని సంప్రదించగలరు.

ఫేస్బుక్ లో ఈ సంస్థ https://www.facebook.com/MusicIndiaAtDubai పేజిని లైక్ చెయ్యండి.

MID వారికి మాగల్ఫ్.కామ్ తరుపున ప్రత్యేక అభినందనలు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com