కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి..

- November 29, 2015 , by Maagulf
కొనసాగుతున్న  అల్పపీడన ద్రోణి..

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. దక్షిణ అండమాన్‌ సముద్రానికి ఆనుకుని అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కదులుతోంది. రానున్న 24 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ హెచ్చరికల కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాతో పాటు, తమిళనాడులోని కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు జిల్లాలోని సత్యవేడు, చంద్రగిరి, శ్రీకాళహస్తిలో భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. వాగులు, వంకలు, కాలువలు వరద నీటితో పొంగి ప్రవహిస్తున్నాయి. కాళంగి జలాశయానికి పరిమితికి మించి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు గేట్లు ఎత్తివేసి నీటిని కిందికి విడుదల చేస్తున్నారు.తమిళనాడులోని కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. వరద ఉద్ధృతికి పలుచోట్ల రహదారులు దెబ్బతిని వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. భారీ వర్షాల కారణంగా కోస్తా తీరంలోని ఆరు జిల్లాల్లోని పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com