ప్రకాశం జిల్లాలో స్కూల్ బస్సు బోల్తా..
- November 29, 2015
ప్రకాశం జిల్లాలో జాతీయ రహదారిపై ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ సమీపంలో సోమవారం ఉదయం పాఠశాల బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా, బస్సులో ఉన్న 40 మంది విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఒంగోలు రైల్వేస్టేషన్ సమీపంలోని సెయింట్ మేరీస్ పాఠశాల బస్సు త్రోవగుంట వైపు నుంచి ఒంగోలు వస్తుండగా లారీ వేగంగా దూసుకొచ్చి ఢీకొట్టింది. దీంతో బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. సమాచారం అందుకున్న తాలూకా పోలీస్‌స్టేషన్ ఎస్సై ఆంటోనీ రాజ్ ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. తీవ్రంగా గాయపడి బస్సులోనే ఇరుకుపోయిన డ్రైవర్‌ను సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు
- మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జయంతి సందర్భంగా..సీఎం రేవంత్ నివాళులు..
- పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలి: సోనుసూద్
- ఈ నెల 18న గవర్నర్‌ను కలవనున్న జగన్
- కూటమి పాలనలో ఎన్నో విజయాలు సాధించాం: మంత్రి పార్థసారధి
- తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయం పై సీఎం రేవంత్ ని అభినందించిన ఎంపీలు
- మంత్రి లోకేష్ అమెరికా పర్యటనలో భారీ పెట్టుబడులకు అవకాశం
- 10 లక్షల ఉద్యోగాలు భారతీయులకు ఇస్తాం: అమెజాన్
- ఉర్దూ అకాడమీ వారోత్సవాలు: మంత్రి ఫరూక్
- 13న హైదరాబాద్ లో లియోనెల్ మెస్సీ సందడి
- గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్







